ఇంత సింపుల్‌ గా పరిచయం చేశారేంటి?

Update: 2016-01-17 07:19 GMT
నాని కొత్త సినిమా పేరు ''కృష్ణగాడి వీర ప్రేమ గాధ''. ఈ సినిమాతో మనోడు మరో బ్లాకబస్టర్‌ కొట్టేసి.. భలే భలే మగాడివోయి సినిమాతో వచ్చిన క్రేజును నిలబెట్టుకుంటాడని ఒక టాక్‌. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్‌ గురించి మనం ఇదివరకే చాలాసార్లు చెప్పుకున్నాం. అమ్మయి పేరు మెహరీన్‌ కౌన్‌ పీర్జాదా. ఈ ముంబయ్‌ చిన్నది తొలిసారి ఫిలింస్‌ లోకి అడుగుపెడుతోంది.

అసలే వీర ప్రేమగాధ అన్నారు కాబట్టి.. ఈ అమ్మాయిని ఓ రేంజు హైపుతో ఇంట్రొడ్యూస్‌ చేస్తారని అనుకున్నారు అందరు. కాని మనోళ్ళు మాత్రం చాలా సింపుల్‌ గా ఇంట్రొడ్యూసింగ్‌ మెహరీన్‌ అంటూ ఒక పోస్టరుతో అమ్మాయిని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఇది ఎంతవరకు సక్సెస్‌ సాధిస్తుందో తెలియదు కాని.. అసలు ఇంత సింపుల్‌ గా పరిచయం చేశారేంటి బాబాయ్‌ అంటూ లవ్ స్టోరీలను ఆధరించే ప్రేక్షకులు మాత్రం కాస్త ఖంగుతిన్నారు.

జనవరి 18న ఆడియో రిలీజ్‌ చేసుకుని ఫిబ్రవరి 5న ధియేటర్లలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నాడు నాని. మరి కొత్తమ్మాయితో కలసి.. రెండో  సినిమాను తీస్తున్న హనూ రాఘవపూడితో ఎటువంటి హిట్టు కొడతాడో చూడాల్సిందే.
Tags:    

Similar News