ఎన్టీఆర్ బయోపిక్ లో భారీ మార్పు

Update: 2018-05-23 06:36 GMT

నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను తెరకెక్కించాలి అంటే సినిమా నిడివి సరిపోదు. సినిమాలో అసలు నిజాలను చూపిస్తే ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. బయోపిక్ అంటే మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి అనే ఫార్ములాను సినిమా వాళ్లు బాగా వాడతారు. సినిమా ఎలా ఉన్నా పరవాలేదు గాని నెగిటివ్ కామెంట్ తెచ్చుకోకూడదని అనుకుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పై కూడా అదే తరహాలో చర్చలు జరుగుతున్నాయి.

సీనియర్ ఎన్టీఆర్ లైఫ్ ని టచ్ చేయడం అంటేనే పెద్ద సాహసం. బాలకృష్ణ ఎలా ప్లాన్ చేస్తారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఎన్టీఆర్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ముందుగా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకటి సినిమా జీవితం నుంచి రాజకీయ జీవితం వరకు. మరొక భాగంలో ఆయన సాధారణ జీవితం గురించి చూపించాలని అనుకున్నారు. అయితే దర్శకుడు తేజ కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో బాలయ్య క్రిష్ ని రంగంలోకి దింపాడు. దీంతో క్రిష్ సలహా మేరకు బాలయ్య రెండు పార్ట్స్ అనే ఆలోచనను మార్చుకున్నాడట.

మూడు గంటల సినిమా సెట్ చేస్తేనే బెటర్ అని క్రిష్ చెప్పారట. దీంతో ఇప్పుడు సినిమా కథలో పెద్ద మార్పులు చేయాలి. రచయితలతో కూర్చొని మళ్లీ మొదటి నుంచి కథను ఎడిట్ చేస్తూ స్క్రీన్ ప్లే లో కూడా మార్పులు చేయాలి. బాలయ్య టీమ్ అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మూడు గంటల సినిమా వరకు సెట్ చేయడానికి ప్రయత్నాలు చేటున్నారట. ఇక పాత్రలకు సంబంధించిన ఎంపికలు పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను పట్టాలెక్కించాలని బాలయ్య ప్లాన్ వేస్తున్నారు. 2019 లో ఎన్టీఆర్ చిత్రం విడుదల కానుంది.
Tags:    

Similar News