మళ్లీ షూటింగ్ మొదలుపెట్టిన క్రిష్...?
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. రాజీవ్ రెడ్డి మరియు జాగర్లమూడి సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ పీరియాడికల్ మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్లిన క్రిష్ కు.. ఒక షెడ్యూల్ షూటింగ్ జరిపిన తర్వాత కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ నేపథ్యంలో పవన్ సెట్స్ లో అడుగుపెట్టడానికి సమయం ఉండటంతో క్రిష్ ఈ గ్యాప్ లో మెగా మేనల్లుడు ప్రాజెక్ట్ లైన్లో పెట్టాడు. 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో శరవేగంగా చిత్రీకరణ జరిపి ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ని నవంబర్ ఫస్ట్ వీక్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావించారు.
ఇదిలా ఉండగా వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో షూటింగ్ జరుగుకుంటున్న వైష్ణవ్ సినిమా యూనిట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ ఆపేశారని వార్తలు వచ్చాయి. అయితే వైష్ణవ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కెమెరా యూనిట్ లోని ఓ వ్యక్తికి కరోనా సోకడం నిజమైనప్పటికీ.. అన్ని జాగ్రత్తలు తీసుకొని తిరిగి షూటింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. యధా ప్రకారం అదే ఫారెస్ట్ లోనే వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ మీద కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక క్రిష్ డైరెక్ట్ చేస్తున్న #PSPK27 ప్రీ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు వైష్ణవ్ నటించిన 'ఉప్పెన' సినిమా రిలీజ్ రెడీగా ఉంది. అయితే ఈ సినిమాని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేస్తారా లేదా థియేటర్స్ రీ ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సివుంది.