పోస్టర్ లో క్రిష్ క్రియేటివిటీ
ఎట్టకేలకు అట్టహాసంగా నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ముహూర్తపు షాట్ నిన్న లాంచనంగా ప్రారంభమైంది. ఈ సినిమా విజయం సాధించాలని టాలీవుడ్ లెజెండ్స్ మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేష్ ప్రత్యేకంగా ఈ వేడుకకు హాజరయ్యి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు. అమరావతి ప్రాధాన్యమున్న చిత్రమైనా తెలంగాణా ముఖ్యమంత్రి గౌరవ అతిధిగా హాజరయ్యి సినిమాను ఆశీర్వదించడం విశేషం.
అయితే ఇప్పుడు అందరికళ్ళూ వేడుక సందర్భంగా విడుదల చేసిన టైటిల్ లోగోపైన పడ్డాయి. సింహవాహన దారుడై శాతకర్ణి యావత్ భారతదేశాన్ని ఎలా పరిపాలించాడో రౌద్రరసంలో చూపెడుతూ విడుదల చేసిన లోగో అందరినీ ఆకట్టుకుంటుంది. బహుసా బాలయ్య సినిమాలలో ఇదే బెస్ట్ లోగో అని చెప్పచ్చు.
అంతేకాక శాతకర్ణి తన తల్లిపేరుని పెట్టుకుని గౌతమీ పుత్ర శాతకర్ణి గా ఎందుకు కీర్తిగడించాడో మా సినిమాలో కీలకమని తెలియజేస్తూ పోస్టర్ లో అందరి పేర్లకి ముందు తమ తల్లి పేర్లు జతచేశాడు. అంజనా పుత్ర క్రిష్ - సుబ్బలక్ష్మి పుత్ర సీతారామశాస్తి - శిరోమణి పుత్ర దేవి శ్రీప్రసాద్ అంటూ వినూత్నంగా పోస్టర్ డిజైన్ చేశాడు. అల్ ది బెస్ట్ క్రిష్