కొరటాల మరో పూరీనా? త్రివిక్రమా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ అలవాటు ఉంది. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి వీలైనంత త్వరగా రెండో ఛాన్స్ ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకాడడు. ఇప్పుడు కొరటాల విషయంలోనూ అదే జరుగుతోంది. శ్రీమంతుడు సక్సెస్ ని రిపీట్ చేస్తాడనే హోప్ తో.. మురుగదాస్ తర్వాతి సినిమా కొరటాలకు ఇచ్చాడని తెలుస్తోంది.
మహేష్ ఇలా డైరెక్టర్లను నమ్మేస్తుంటాడు కానీ.. ఆ దర్శకులు నమ్మకం నిలబెట్టుకున్న ఛాయలు లేవు. ఒక్కడు తర్వాత గుణ శేఖర్ అర్జున్ - సైనికుడు వీర ఫ్లాప్స్ ఇచ్చాడు. టాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ అనిపించుకునే త్రివిక్రమ్ కూడా.. మహేష్ తో రెండో సినిమా హిట్ చేయలేకపోయాడు. అతడు హిట్ అయినా.. ఖలేజా ఫ్లాప్ అయిపోయింది. రీసెంట్ గా శ్రీకాంత్ అడ్డాల ఏం చేశాడో చూశాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ హిట్ ఇచ్చాడని నమ్మి.. బ్రహ్మోత్సవం ఇస్తే.. కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చేతిలో పెట్టాడు అడ్డాల.
అయితే.. మహేష్ తో రెండో సినిమా సెంటిమెంట్ బారిన పడని దర్శకుడు ఒకే ఒక్కడు. అతనే పూరి జగన్. పోకిరి తర్వాత బిజినెస్ మేన్ ని కూడా హిట్ చేయగలిగాడు. మరిప్పుడు కొరటాల కూడా మహేష్ తో రెండోది చేయబోతున్నాడు. మరి ఈ డైరెక్టర్ పూరీలా మహేష్ తో రెండో హిట్ కొడతాడో.. లేక త్రివిక్రమ్ సహా ఇతర డైరెక్టర్ల లాగా నిరుత్సాహపరుస్తాడో? వెయిట్ అండ్ సీ.