కొరటాల చాలా ఎక్కువ మాట్లాడేశాడే..
రైటర్ టర్న్డ్ డైరెక్టర్ కొరటాల శివ మామూలుగా మితభాషి. తన సినిమాల గురించి ఎక్కువగా చెప్పుకోడు. అందులోనూ ప్రారంభోత్సవ సమయంలో ఆయన నోరు విప్పడు. తన తొలి మూడు సినిమాల విషయంలో ఇలాగే చేశాడు. ఐతే ఆ మూడు సినిమాలూ బ్లాక్ బస్టర్లు కావడంతో ఆత్మవిశ్వాసం బాగా పెరిగినట్లుంది. మహేష్ బాబుతో చేయబోయే కొత్త సినిమా గురించి ఇప్పుడే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు.
‘శ్రీమంతుడు’ తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప కథల్లో ఒకటిగా కితాబులందుకుంది. ఇప్పుడు మహేష్ తో చేయబోయేది దాన్ని మించిన.. మరింత శక్తిమంతమైన కథ అంటున్నాడు కొరటాల శివ. మహేష్ తో మళ్లీ తన సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయని.. వాటిని కచ్చితంగా ఈ సినిమా అందుకుంటుందని అంటున్నాడు. అంతే కాదు.. తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రమదని మరో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు కొరటాల.
కొరటాల సినిమా ప్రారంభోత్సవంలోనే ఈ స్థాయిలో చెప్పేస్తుండటంతో మహేష్ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. గత రెండు సినిమాల్లోనూ సామాజికాంశాలకు పెద్ద పీట వేసి.. ప్రేక్షకుల్ని మెప్పించిన కొరటాల.. ఈసారి కూడా అదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఇందులో రాజకీయాల మీద చర్చ ఉంటుందట. స్వచ్ఛ రాజకీయాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. అందుకే ఇది గొప్ప కథ అంటున్నాడు కొరటాల. ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ ఆ టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ ఖండించింది. వచ్చే ఏడాది దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/