'ఆచార్య' టీజర్ అప్డేట్ ఇచ్చేసిన కొరటాల..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ కిచ్లు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు టైటిల్ మోషన్ పోస్టర్.. గుడి సెట్ వీడియో.. 'సిద్ధ'గా చరణ్ బ్యాక్ లుక్ మినహా ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ చిత్ర యూనిట్ షేర్ చేయలేదు. ఈ నేపథ్యంలో టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చిరు - కొరటాల మధ్య సంభాషణ జరిగినట్లు ఫన్నీగా వెల్లడించి ఈరోజు బుధవారం ఉదయం 10 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
కొరటాల శివ చెప్పినట్లుగానే 'ఆచార్య' టీజర్ అనౌన్సమెంట్ ఇచ్చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు 'ధర్మస్థలికి డోర్స్ ఓపెన్ అవుతాయ'ని చెప్తూ 'ఆచార్య' టీజర్ అప్డేట్ ఇచ్చారు. దీంతో 'ఆచార్య' టీజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా, కొరటాల ఈ చిత్రాన్ని తనదైన శైలిలో సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. దేవాదయ భూములు - నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Full View