మెగాస్టార్ తర్వాత మెగా పవర్ స్టారే!
స్టార్ డైరెక్టర్ కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య'ను తెరకెక్కిస్తున్నారు. కొరటాల రెగ్యులర్ చిత్రాల స్టైల్లోనే ఈ సినిమాలో కూడా ఒక సామాజిక అంశాన్ని చర్చిస్తూనే కమర్షియల్ అంశాలు ఉండేలా.. మెగాస్టార్ నుండి అభిమానులు ఆశించే ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దుతున్నారట. ఈ సినిమాను ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తి కాక మునుపే కొరటాల తదుపరి చిత్రం కూడా లాక్ అయిందని సమాచారం. మెగాస్టార్ సినిమా పూర్తి కాగానే కొరటాల తన నెక్స్ట్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తారని సమాచారం. చరణ్ ప్రస్తుతం 'RRR' షూటింగ్ లో పాల్గొంటున్నారు. 'ఆచార్య' కంప్లీట్ అయ్యే లోపు 'RRR' లో చరణ్ పాత్ర చిత్రీకరణ కూడా పూర్తవుతుందట. దీంతో చరణ్ వెంటనే కొరటాల ప్రాజెక్టు లో జాయిన్ అవుతారట.
నిజానికి కొరటాల శివ-చరణ్ కాంబినేషన్లో గతంలోనే ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. కొరటాల శివ డెబ్యూ ఫిలిం 'మిర్చి' తర్వాత చరణ్ తో ఒక సినిమాను ప్రకటించారు. అయితే ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. అప్పుడు మిస్ అయిన చరణ్ -కొరటాల కాంబో ఇప్పుడు సెట్ అయింది. కొరటాల ఇలా మెగాస్టార్ తో ఆయన తనయుడు చరణ్ తో వరసగా సినిమాలు చేయబోతూ ఉండడం విశేషమే.