ఆచార్య: కొరటాల వెర్షన్ వేరేగా ఉందే!
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో ఒక అతిథి పాత్ర కోసం మొదట చరణ్ ను అనుకున్నారు. అయితే RRR షూటింగ్ డిలే కారణంగా చరణ్ కాల్షీట్స్ దొరుకుతాయో లేదో అనే ఉద్దేశంతో మహేష్ బాబును తీసుకుందామని ఆలోచన చేసినట్టు ప్రచారం సాగింది. భారీ రెమ్యునరేషన్ కారణంగా మహేష్ బాబును ఎంచుకో లేదని.. చరణ్ తోనే ఆ పాత్రను చేయించాలని ఫిక్స్ అయ్యారు అంటూ మళ్ళీ వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ "ఆచార్య విషయంలో మహేష్ అసలు మా చర్చల్లోకి రాలేదు"అంటూ తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చారు.
దీంతో దీంతో సహజంగానే 'ఆచార్య' లో మహేష్ నటించే విషయం గాసిప్ అని చాలామంది సరిపెట్టుకున్నారు. అయితే తాజాగా కొరటాల శివ తో ఇంటర్వ్యూ మహేష్ బాబు విషయం ప్రస్తావించారు. 'ఆచార్య' లో చరణ్ ను ఓ పాత్ర కు అనుకున్నామని అయితే RRR డిలే కారణంగా చరణ్ 'ఆచార్య' లో నటించడం వీలు కాదేమో అని టెన్షన్ పడుతున్న సమయంలో ఒకరోజు క్యాజువల్ గా మహేష్ తో మాట్లాడుతూ ఉన్నారట. ఆ సమయంలో కొరటాల సమస్యను మహేష్ అర్థం చేసుకుని "నేనున్నాను.. భయపడకండి"అంటూ ధైర్యం చెప్పారట. ఈ లెక్కన చరణ్ కి కుదరని పక్షంలో ఆ పాత్రలో నటించేందుకు రెడీ అని మహేష్ మాట ఇచ్చినట్టే అనుకోవాలి. మహేష్ లాంటి పెద్ద స్టార్ హీరో తన సమస్యను అర్థం చేసుకుని అలా హామీ ఇవ్వడం చాలా సంతోషం అనిపించిందని.. కానీ కొందరు సన్నిహితులతో పంచుకోవడంతో అది కాస్తా పెద్ద వార్త అయిపోయిందని చెప్పారు.
మహేష్ ఈ సినిమాలో నటించడానికి భారీ రెమ్యునరేషన్ కోట్ చేయడం.. మెగా ఫ్యామిలీ అందుకు ఒప్పుకోకుండా చరణ్ నే కొనసాగించడం.. ఇలాంటి వార్తల్లో నిజా నిజాలు ఎన్ని ఉన్నాయో పక్కనపెడితే.. కొరటాల కోసం ఈ సినిమాలో నటించేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది మాత్రం నిజం.