ఒక రివ్యూ ఇచ్చిన మెగా చెల్లెలు

Update: 2018-04-01 05:11 GMT
మెగా ఫ్యామిలీ ఆనందం మామూలుగా లేదు. సంక్రాంతికి అజ్ఞాతవాసి దెబ్బకు ఇంటెలిజెంట్ మరింత ఆజ్యం పోస్తే వరుణ్ తేజ్ తొలిప్రేమతో దాన్ని కొద్దిగా చల్లార్చే ప్రయత్నం చేసాడు. కాని చిట్టిబాబు రామ్ చరణ్ మాత్రం లెక్కలు మొత్తం మార్చేసే కుటుంబానికే కాదు మెగా హీరో ఫాన్స్ అందరిని గర్వపడేలా చేసాడు. మొదటి రోజు తన కెరీర్ బెస్ట్ రికార్డు చేసిన రంగస్థలంపై ప్రశంశల వర్షం ఆగటం లేదు. వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సినిమా గురించి చరణ్ యాక్టింగ్ గురించి మామూలు పొగడ్తలతో సరిపుచ్చడం లేదు. ఇప్పుడు ఒక మనసు సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన నాగబాబు మెగా డాటర్ నీహారిక తనదైన శైలిలో అభిప్రాయం కాదు ఏకంగా మినీ రివ్యూ ఇచ్చేసింది. చిరు ఫ్యామిలీతో చాలా బలమైన బాండింగ్ ఉన్న నీహారిక ఏమందో చూడండి.

“ఇది మూడు గంటల అత్యున్నత ప్రతిభకు సజీవ సాక్ష్యం.సుకుమార్ గారి అసాధారణమైన దర్శకత్వ ప్రతిభ-స్క్రీన్ ప్లే అమోఘం. దేవిశ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ పాటలు ఎక్స్ ట్రాడినరి. లాస్ట్ కాని లీస్ట్ చిట్టిబాబు నా అన్నయ్య అమోఘం. కోపం - ప్రేమ - అమాయకత్వం - వెర్రితనం - కామెడీ - సెంటిమెంట్ ఒకటేమిటి తను చేయనిది ఇందులో లేదు. మా అన్నా మజాకా. వినపడుతుండా మీ రంగస్థలం అదిరింది”

ఇదంటి మెగా సిస్టర్ ఇచ్చిన మినీ రివ్యూ. అందరు ట్వీట్ల ద్వారా తమ సంతోషాన్ని ఏదో ఒక రూపంలో పంచుకుంటూనే ఉన్నారు. వరుణ్ తేజ్ మొన్నే తన ఆనందాన్ని షేర్ చేసుకోగా పవన్ కళ్యాణ్ తన బ్యానర్ ద్వారా ట్విట్టర్ లో శుభాకాంక్షలు కూడా తెలిపాడు. ఇక చిరు గురించి చెప్పేదేముంది. మొత్తానికి చరణ్ లోని కంప్లీట్ యాక్టర్ ని ఆవిష్కరించిన సుకుమార్ పై అభినందనల వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు. 
Tags:    

Similar News