శంకరాభరణం.. 40 కోట్ల దమ్ము ఉందట

Update: 2015-11-29 11:30 GMT
శంకరాభరణం.. ది పవర్ ఆఫ్ కోన వెంకట్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆయన కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించి.. దర్శకత్వ పర్యవేక్షణ చేయడమే కాక.. నిర్మాణంలోనూ పాలుపంచుకున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఎన్నో విజయవంతమైన సినిమాలకు పని చేసిన కోన.. ఈ సినిమా మీద చాలా చాలా కాన్పిడెంటుగా ఉన్నాడు. ఆయన అంచనా ప్రకారమైతే ఈ సినిమాకు రూ.40 కోట్లు వసూలు రాబట్టే స్థాయి ఉందట. స్క్రిప్టులో అంత దమ్ము ఉందని.. మరి ఎలా ఆడుతుందో చూడాలని అంటున్నాడు కోన.

శంకరాభరణం కథకు బీజం పడిన వైనం గురించి చెబుతూ.. ‘‘2000లో అనురాగ్ కశ్యప్ రచయితగా, ఇ.నివాస్ దర్శకత్వంలో వర్మ నిర్మించిన ‘శూల్’కి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని. బీహార్ నేపథ్యంలో సాగే ఆ కథ కోసం ఆ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తిరిగాను. కిడ్నాపింగ్ అనేది అక్కడ ఓ పెద్ద పరిశ్రమ అని తెలిసి ఆశ్చర్యపోయా. అప్పుడే ఈ కథకు బీజం పడింది. ‘ఫస్ గయారే ఒబామా’ చూశాక ఈ కథ మీద ఇంకా క్లారిటీ వచ్చింది. ఆ సినిమాను కొంత వరకు స్ఫూర్తిగా తీసుకుని ‘శంకరా భరణం’ స్క్రిప్టు తయారు చేశా. సరిగ్గా ఆడితే రూ. 40 కోట్లొచ్చే స్క్రిప్టు ఇది. ఐతే దీన్ని స్టార్ హీరోతో చేయొచ్చు కదా అనొచ్చు. కానీ చాలామంది స్టార్స్ వాళ్ళ ఇమేజ్ అనే బ్యాగేజీతో వస్తారు. ఫ్యాన్స్ అంచనాలు సరేసరి. అందుకే స్టార్లు నటిస్తే పాత్రలు కాకుండా, వాళ్ళే కనపడుతుంటారు. అందుకే కొత్త రకం స్క్రిప్టులు ఎంచుకొనే నిఖిల్ లాంటి హీరో దీనికి కరెక్ట్ అనిపించిది. నిఖిల్ కెరీర్ కు ఇది ఒక ‘దూకుడు’ లాంటి హిట్టవుతుంది.’’ అని చెప్పాడు కోన.
Tags:    

Similar News