బాహుబలి సినిమాది 35 కోట్ల కేటగిరీ??

Update: 2015-12-30 03:42 GMT
ఏం చేసినా కూడా తమిళ క్రిటిక్స్‌ కే చెల్లింది. గతంలో ఓసారి మనోళ్ళు తెలుగు ఇండస్ర్టీకి పెద్ద పంచ్‌ వేశారు. మా పులి సినిమా కూడా 100 కోట్లు వసూలు చేసింది.. మీ మగధీర ఏంటి 75 ప్లస్సేగా అంటూ కటింగ్‌ ఇచ్చారు. ఏంటో వీరి పైత్యం అంటూ అప్పట్లో నిజాన్ని చెప్పుకున్నాం. తమిళంలో పులి 100 వసూలు చేసిందంటే.. దానర్ధం 100 కోట్ల గ్రాస్‌ అని. అంటే షేర్‌ కేవలం 55 కోట్లు అనమాట. మరి మగధీర వసూళ్ళతో పొంతనేముంది?

ఇప్పుడు కూడా సేమ్‌ ఇదే టైపు కామెడీ మరొకటి చేస్తున్నారు. అదేంటంటే.. బాహుబలి సినిమాను 35 కోట్ల ప్రొడక్షన్‌ బడ్జెట్‌ క్యాటగిరీలో పెట్టారు. ఆ క్యాటగిరీలో సక్సెస్‌ అయిన ఇతర తమిళ సినిమాలు అంటూ తని ఒరువన్‌ - మారి - భూలోగమ్‌ - అనెగన్‌ సినిమాల పేర్లను రాశారు. అసలు మ్యాటర్‌ ఏందయ్యా అంటే.. ఒక ప్రముఖ క్రిటిక్‌ కమ్‌ రైటర్‌ తమిళంలో వచ్చిన సినిమాలను విశ్లేషిస్తూ.. బాహుబలిని ఆ క్యాటగిరిలో పడేశాడు. మరి ప్రొడక్షన్‌ బడ్జెట్‌ 35 కోట్లతో వచ్చి సక్సెస్‌ అయిన బాహుబలి కంటే..  35+ కోట్లతోతీయబడిన వేదళం - పాపనాశనం - తూంగవనమ్‌.. రచ్చాతి రచ్చః అంటూ సదరు రైటర్‌ రాయడం ఇంకా విడ్డూరం. ఈ ఆర్టికల్‌ ఒక ప్రముఖ వార్తాపత్రికలో రావడం.. పిచ్చ టు ది మ్యాక్స్‌.

అసలు బాహుబలి డబ్బింగ్‌ సినిమా కాదు.. తెలుగు తమిళ బైలింగువల్‌ అంటూ మొదటి నుండి చెబుతున్నారు. పైగా ఆ సినిమాలోని కొందరు పెద్ద స్టార్లు తమిళవారే. అయినాసరే ఈ 150 కోట్ల పై బడ్జెట్‌ తో తీసిన సినిమాను 35 కోట్ల ఫిలిం అనడం.. వారికే చెల్లింది.
Tags:    

Similar News