ట్రైలర్ టాక్ : ఎప్పుడూ చూడని విధంగా నయన్

Update: 2018-07-06 04:56 GMT

తెలుగులో అనుష్క ఎలానో.. తమిళంలో నయనతార కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో స్టార్ డం తెచ్చుకుంది. కొన్ని నెలల కిందటే విడుదలైన ‘కర్తవ్యం’ సినిమాలో నయనతార నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఆ చిత్రం తమిళంలో చాలా పెద్ద హిట్టయ్యింది. అంతకుముందు ‘మయూరి’ అనే హర్రర్ మూవీలోనూ అదరగొట్టింది. తాజాగా ఆమె ‘కోలమావు కోకిల’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ కు తమిళనాట  అపూర్వ స్పందన వస్తోంది. నయన్ ఇందులో స్మగ్లర్ పాత్రలో నటించింది.  కథలో భాగంగా 25 కోట్ల విలువైన ఒక పౌడర్ ను నయన్ ఒక చోటు నుంచి మరో చోటికి చేర్చాలి. ఇందుకోసం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తుంటుంది. భయం, భయంగా.. ఏమీ తెలియని అమాయకురాలిగా ఇందులో కనిపించింది. ఆమెది పేద కుటుంబం. తల్లిదండ్రులు, ఒక చెల్లెలు ఉంటారు. వాళ్లతో పాటు నయన్ ను ప్రేమించే ఒక కమెడియన్ కూడా వీళ్లతోనే ఉంటాడు. వీళ్లంతా కలిసి ఒక వ్యాన్ లో బయలు దేరుతారు. ఈ క్రమంలోనే వాళ్లకు ఎదురయ్యే సంఘటనల నేపథ్యంలోనే సినిమా సాగుతుంది.

నయనతారను అంతమొందించాలని విలన్లు ప్రయత్నిస్తుండడంతో.. నయన్ ఎదురు తిరిగి తనలోని అసలు యాంగిల్ ను చూపిస్తుంది. విలన్లకు షాకిస్తుంది. ట్రైలర్ చూస్తే సినిమా ఆద్యంతంగా వినోదాత్మకంగా.. హర్రర్ నేపథ్యంలో సాగుతున్నట్టు అర్థమవుతోంది.

ఈ సినిమాలో ఎప్పుడూ చేయనటువంటి క్యారెక్టర్ లో నయన తార నటించింది. ఆమె లుక్, స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోయాయనే చెప్పాలి. ట్రైలర్ చూస్తే సినిమా ఖచ్చితంగా హిట్టయ్యేలానే కనిపిస్తోంది. ట్రైలర్ కు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తెలుగులో కూడా అనువాదం అయ్యే అవకాశాలున్నాయి.



Full View
Tags:    

Similar News