‘వరుడు కావలెను’ లిరికల్ సాంగ్.. ఆ గొంతులో ఏం దాచావయ్యా శ్రీరామ్!
నాగశౌర్య హీరోగా, రీతువర్మ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘వరుడు కావలెనను.’ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో.. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే హీరో శౌర్య బర్త్ డే సందర్భంగా స్మాల్ వీడియో క్లిప్ రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా లిరికల్ సాంగ్ విడుదల చేసింది.
‘చూపులే.. నా గుండె అంచుల్లో.. కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే..’ అంటూ సాగిపోయే మెలోడీ సంగీత ప్రియులకు వీనుల విందే అనడంలో సందేహం లేదు. తన పాటలతో యూత్ ను ఊపేస్తున్న గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట.. మరోసారి యువతను ఉర్రూతలూగించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం.. ఎంతో శ్రావ్యంగా ఉంది. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉన్న ఈ ప్రేమ గీతం.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. లిరిక్ రైటర్ గోసల అందించిన సాహిత్యం.. అద్భుతంగా ఉంది. విశాల్ బాణీలకు గోసల తనదైన సాహిత్యాన్ని జోండించగా.. హృద్యంగా ఆలపించిన సిద్ శ్రీరాం పాటకు ప్రాణం పోశాడనే చెప్పాలి.
ఈ చిత్రంలో మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను.. వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్రబృందం తీవ్రంగా కృషి చేస్తోంది.
Full View