అడల్ట్ క్లబ్ కు వెళ్లిన కేఎల్ రాహుల్.. భార్య అతియా స్పందన ఇదీ

Update: 2023-05-28 16:24 GMT
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ చేసిన పని వైరల్ అయ్యింది. ఇటీవల ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరుతో  ఐపిఎల్ మ్యాచ్‌లో బంతిని ఆపడానికి స్ప్రింట్ చేస్తున్నప్పుడు గాయం కావడంతో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. కేఎల్ రాహుల్ కుడి తొడపై తీవ్రమైన గాయంతో బాధపడ్డాడు.  తనను తాను అన్ ఫిట్ గా.. అనర్హుడనని ప్రకటించడంతో అతను పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

దీంతో నిరాశ చెందిన కేఎల్ రాహుల్ తన కుడి తొడకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఇంగ్లండ్ వెళ్లాడు. తాజాగా కేఎల్ రాహుల్ లండన్ వీధుల్లో క్రచెస్‌తో నడుస్తున్న ఓ అడల్ట్ క్లబ్ లో కనిపించాడు. ఈ ఫోటోలను అప్‌లోడ్ చేశాడు. అప్పటి నుంచి కేఎల్ రాహుల్ యూకేలో ఉన్నాడని ఎంజాయ్ చేస్తున్నట్టు బయటపడింది..

చాలా మంది ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ కు మద్దతు పలికారు. "కెఎల్ రాహుల్‌తో పాటు అథియా ఇంగ్లండ్‌లో ఉన్నారు. ఈ స్ట్రిప్‌క్లబ్‌లో ఆమె కూడా ఉండొచ్చు లేదా కేఎల్ రాహుల్ ఈ క్లబ్ కు వెళ్లాడన్న సంగతి ఆమెకు తెలుసు. భారతీయులు ఎందుకు ఇంత ప్యూరిటానికల్‌గా వ్యవహరిస్తున్నారు? కేఎల్ రాహుల్ తప్పు చేయకున్నా నిందిస్తున్నారు " అని ఒక ట్విట్టర్ వినియోగదారు రాశారు.

"అథియా ఇంగ్లాండ్‌లో ఉంది, కానీ ఆమె అతనితో పాటు స్ట్రిప్ క్లబ్‌లో ఉన్నారో లేదో ఖచ్చితంగా తెలియదు" అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. "కేఎల్ రాహుల్ తో అతడి భార్య కూడా  విహారయాత్రలో ఉంది. ఆమెకు ఏదైనా సమస్య లేకుంటే రాహుల్ ఏ క్లబ్ కు వెళ్లినా మనకు అభ్యంతరం లేదు' అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
Read more!

"ఇది నైట్‌క్లబ్ మాత్రమేనని,  అడల్ట్ స్ట్రిప్ క్లబ్ కాదని ఆయన భార్య అతియా క్లారిటీ ఇచ్చారు. "ఆటగాడిగా నేను కేఎల్ రాహుల్ ను ఇష్టపడనంతగా ఎవరూ పడరు.. ఒక వ్యక్తి తన జీవితాన్ని తన ఇష్టంగా గడుపవద్దా? కేఎల్ చట్టానికి లోబడి పనులు చేస్తుంటే, ఏదైనా చెప్పడానికి మనం ఎవరు." అంటూ నెటిజన్లకు ఆతియా గట్టి హెచ్చరిక పంపింది.

ఇప్పుడు, నైట్‌క్లబ్‌లో కెఎల్ రాహుల్‌తో పాటు అతియా శెట్టిని చూడగలిగే మరో వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Similar News