• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమెజాన్ ప్రైమ్ కి కీర్తి...

అమెజాన్ ప్రైమ్ కి కీర్తి సురేశ్ సెన్సేషనల్ మూవీ!

By - Tupaki Desk
Update: 2022-01-23 05:19 GMT
కీర్తి సురేశ్ ముద్దుగా .. బొద్దుగా .. ముద్దమందారంలా కనిపిస్తూ ఉంటుంది. అందమైన నవ్వుతో వెన్నెల్లో చందమామను గుర్తుచేస్తూ ఉంటుంది. బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన కీర్తి సురేశ్, తమిళ .. తెలుగు భాషల్లో చాలా తక్కువ సమయంలో స్టార్ డమ్ తెచ్చుకుంది. చాలామంది కథానాయికల మాదిరిగానే ఆడిపాడే పాత్రలకి మాత్రమే పనికొస్తుందని అనుకున్నారు. కానీ 'మహానటి' సినిమాతో ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది. అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతో ప్రేక్షకులు ఆమెను తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెట్టారు.

అయితే కీర్తి ప్లానింగ్ లోపం కారణంగా 'మహానటి' తరువాత ఆమె చెప్పుకోదగిన సినిమాలు చేయలేకపోయింది. ఆ సినిమా తరువాత వరుస తమిళ సినిమాలు చేస్తూ, తెలుగు ప్రేక్షకుల నుంచి గ్యాప్ వచ్చేలా చేసింది. 'మహానటి' సక్సెస్ ప్రభావంతో వరుసగా నాయిక ప్రధానమైన కథలను ఒప్పేసుకుంటూ వెళ్లింది. కానీ సావిత్రి కథకు .. మిగతా కథలకు ఉన్న తేడా ఏమిటనేది ఆ సినిమాల వలన ఆమెకి అర్థమైంది. ఇక ఈ లోగా సన్నబడితే బాగుంటుందనే ఆలోచనతో ఆ ప్రయోగం కూడా చేసింది. దాంతో అభిమానుల నుంచి మైనస్ మార్కులు పడటం మొదలైంది.

అసలు విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన కీర్తి సురేశ్ .. ఇక 'సర్కారువారి పాట'తో లైన్లో పడదామని అనుకుంటే, ఆ సినిమా అలా ఆలస్యమవుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో తమిళంలో ఆమె 'సానికాయిదం' సినిమా చేసింది. దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేశాడు. ఈ సినిమా ఫస్టు లుక్  అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. కరడుగట్టిన ఒక నేరస్థురాలిగా కీర్తి సురేశ్ ను పోస్టర్ లో చూసినవారు, సినిమాపై ఆసక్తిని పెంచుకున్నారు. ఈ సినిమా ఎప్పుడు థియేటయర్లకు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

కానీ ఈ సినిమా ఓటీటీ ద్వారా పలకరించనుంది. గతంలో కీర్తి సురేశ్ 'పెంగ్విన్' సినిమాను స్ట్రీమింగ్ చేసిన అమెజాన్ ప్రైమ్ వారు, ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం కూడా చేసుకున్నారు. అందుకోసం వాళ్లు భారీ మొత్తాన్నే చెల్లించినట్టుగా తెలుస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి. ఇక కీర్తి సురేశ్ ప్రస్తుతం నాని 'దసరా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా కావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాదిలో కీర్తి సురేశ్ పుంజుకుంటుందేమో చూడాలి.         
Tags:    
  • amazonprime 
  • keerthisuresh 
  • movienews 
  • tupakiupdates 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS