వ‌డివేలు స‌ర‌స‌న స‌ర్కార్ వారి హీరోయిన్?

Update: 2021-09-22 13:30 GMT
కోలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు కొన్ని వివాదాల స‌హా వ్య‌క్తిగ‌త కార‌ణాలు కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ఆయ‌న సిల్వ‌ర్ స్క్రీన్ కి దూరంగా ఉన్నారు. అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో వివాదం..ఆ సినిమా నుంచి వ‌డివేలు త‌ప్పుకోవ‌డం...భ‌విష్య‌త్ లో ఆయ‌న‌తో సినిమాలు చేయ‌ను..అత‌ని స్నేహ‌మే వ‌ద్దంటూ ఇటీవ‌లే మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు వ‌డివేలు. దీంతో శంక‌ర్-వ‌డివేలు వివాదం తాత్కిలికంగా బ్రేక్ పడింది. ఇక `ఇండియ‌న్ -2` నిర్మాణంలో భాగంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి-శంక‌ర్ కి మ‌ధ్య వివాదాలు త‌లెత్తి ఆ ప్రాజెక్ట్ మ‌ధ్య‌లో ఆగిపోయింది.

ఇలా శంక‌ర్ వ‌డివేలు..లైకాతో వివాదాల‌తో అంట‌గాగుతున్నారు. స‌రిగ్గా ఇదే వేడి వాతావ‌ర‌ణం లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలుతో సినిమా చేస్తోంది. అతడిని మెయిన్ లీడ్ లో ఓ పెట్టి క‌థానాయిక‌ను వెతుకుతోంది. `నాయి శేఖ‌ర్ రిట‌ర్న్స్` పేరుతో ఈ చిత్రం రూపొంద‌నుంది. 2006 లో విడుద‌లైన `థ‌లై న‌గ‌రం`లో వ‌డివేలు పోషించిన ఐకానిక్ క్యారెక్ట‌ర్ నాయ్ శేఖ‌ర్ ఆధారంగా అదే టైటిల్ తో సినిమాని నిర్మిస్తున్నారు. దీనికి `థ‌లై న‌గరం` చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సూర‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఇందులో ఓ కీల‌క పాత్ర‌కు కీర్తి సురేష్ ని రంగంలోకి దింపుతున్నారు. మ‌రి వ‌డివేలుకు జోడీగా న‌టించాల‌ని ప్ర‌పోజ‌ల్ పెడ‌తారా? లేక కీల‌క పాత్ర‌తోనే స‌రిపెడ‌తారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ప్ర‌స్తుతం లైకా సంస్థ కీర్తితో సంప్ర‌దింపులు జ‌రుపుతోందిట‌. స్టార్ క‌మెడియ‌న్ స‌ర‌స‌న న‌టించ‌డానికి కీర్తి సురేష్ ఒప్పుకునే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయంటున్నారు. న‌టిగా ఆమె కెరీర్ తెలుగు..త‌మిళ్ లో ధేధీప్యమానంగా సాగుతోంది. పాత్ర‌ల విష‌యంలో చాలా సెల‌క్టివ్ గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో `నాయి శేఖ‌ర్ రిట్స‌ర్స్` లో కీర్తి పాత్ర‌కు ఎక్కువ స్కోప్ ఉంటే వ‌డివేలుతో గ్రీన్ సిగ్నెల్ ఇచ్చే అవ‌కాశం ఉండొచ్చు. కీర్తి ప్ర‌స్తుతం సర్కార్ వారి పాట చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News