• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గీతా ఆర్ట్స్ లో కిరణ్...

గీతా ఆర్ట్స్ లో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా..!

By - Tupaki Desk
Update: 2022-01-06 06:30 GMT
‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. విలక్షణమైన కథలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇటీవల ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో యువ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన కిరణ్.. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. గీతాఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై ఇటీవలే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యువ నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈరోజు గురువారం మేకర్స్ ఈ ప్రాజెక్ట్స్ సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు.

ఈ సందర్భంగా 'మనం ఇతరుల కోసం చేసేదే గొప్ప మేలు' అనే ట్యాగ్ లైన్ తో ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇది జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో రూపొందనున్న 7వ ప్రాజెక్ట్.. అలానే కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 7వ చిత్రం కావడం గమనార్హం. #KA7 చిత్రానికి సంబంధించిన టైటిల్ ను రేపు (జనవరి 7) శుక్రవారం ఉదయం 10:19 గంటలకు రివీల్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు రేపు వెల్లడికానున్నాయి.

కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘సమ్మతమే’ ‘సెబాస్టియన్’ సినిమాలతో పాటుగా దర్శకుడు కోడి రామకృష్ణ కూతురి ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అలానే మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్ తో కలిసి ఇటీవలే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో సినిమా చేస్తుండటం యువ హీరో కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
Tags:    
  • Kiran Abbavaram 
  • Kiran Abbavaram movies 
  • Kiran Abbavaram images 
  • geetha arts 2 
  • Bunny Vasu 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS