విడాకులే కావాలంటున్న హాలీవుడ్ స్టార్ కపుల్..!!

Update: 2021-01-09 05:15 GMT
హాలీవుడ్‌ పాపులర్ కపుల్ కిమ్ కర్దాషియాన్, కాన్యే వెస్ట్ విడాకులకు సిద్దపడ్డారనే పుకార్లు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పుకార్లు నిజమయ్యేలా ఈ స్టార్ కపుల్ విడాకులు తీసుకోవడానికి రెడీ అని తెలిసింది. గత కొద్దికాలంగా వీరిద్దరి వేరువేరుగా నివసిస్తున్నట్లు సమాచారం. కిమ్ కర్దాషియాన్ తన నలుగురు పిల్లలతో కలిసి లాస్ ఏంజెల్స్ లో ఒం‍టరిగా ఉంటుందట. అలాగే కాన్యే వెస్ట్ ప్రస్తుతం వోమింగ్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య సమస్యలు పరిష్కరించుకోలేని స్థాయికి చేరడంతో విడాకుల వైపు అడుగులేస్తున్నారని మీడియాలో కథనాలు వెల్లువడుతున్నాయి. కిమ్‌, కాన్యే ఇద్దరూ 2014లో వైభవంగా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. వీరికి నలుగురు పిల్లలు. ఈ ఏడేళ్ల దాంపత్య జీవితం ముగించి త్వరలో విడిపోనున్నారు.

అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల టైం నుండే  కిమ్, కాన్యేల జీవితంలో కలహాలు మొదలయ్యాయట. ఇక కిమ్ తల్లి పై కేన్‌ మనస్తాపం చెందాడట. అందుకే ఇద్దరూ దూరంగా ఉంటున్నారట. మూడు నెలల క్రితం మీడియాకు కనిపించిన తర్వాత మళ్లీ వారిద్దరు కలవలేదట. జీవితం గురించి కీలక నిర్ణయం తీసుకోవడానికి కాన్యే వెస్ట్ చాలా సమయం తీసుకుంటున్నాడు. వోమింగ్‌లో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన లైఫ్ గురించి ఆలోచిస్తున్నాడని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇంకా కాన్యే పబ్లిక్ గా 'తన మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు కిమ్ సపోర్ట్ చేసిందని.. కానీ ఇదంతా అప్పట్లో' అని చెప్పాడు. అయితే ఎన్నికల టైంలో కిమ్ తల్లిని కాన్యే దూషించడంతో కిమ్ ఇప్పుడు విడాకులకు రెడీ అయిందట. ఇక కిమ్ కి కాన్యే వెస్ట్ మూడో భర్త. ఇప్పుడు మూడో భర్తకు కూడా విడాకులు ఇచ్చేస్తోంది. మరోవైపు కాన్యేకి కిమ్ రెండో భార్య. వీరిద్దరూ వాళ్లకు విడాకులు ఇచ్చి ఒక్కటయ్యారు. కానీ ఇప్పుడు వీరిదద్దరే విడిపోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News