• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రిలీజ్ డేట్ కోసం పోటీ...

రిలీజ్ డేట్ కోసం పోటీ పడనున్న 'కేజీఎఫ్ 2' - 'పుష్ప'..?

By - Tupaki Desk
Update: 2021-05-12 03:30 GMT
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమాల విడుదలలు వాయిదా పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇంకొన్నాళ్లు మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు నెలలో విడుదల కావాల్సిన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక షూటింగ్ పార్ట్ - వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉన్న 'ఆర్.ఆర్.ఆర్' లాంటి సినిమాలు వచ్చే ఏడాదికి వెళ్లిపోనున్నాయని టాక్ నడుస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని అనేక వాయిదాల తర్వాత దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు అనుకున్న సమయానికి ట్రిపుల్ ఆర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని.. ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో 'RRR' రిలీజ్ డేట్ కోసం 'కేజీఎఫ్ 2' - 'పుష్ప' వంటి చిత్రాలు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ - దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'కేజీఎఫ్ 2'. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి రిలీజ్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. అధికారికంగా ప్రకటించనప్పటికీ 'కేజీఎఫ్' పార్ట్ 2 వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా బరిలో నిలుపుతారని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అదే స్లాట్ కోసం 'పుష్ప' పోటీకి దిగితే మాత్రం సిచ్యుయేషన్ వేరేగా ఉంటుంది.

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'పుష్ప' చిత్రాన్ని ముందుగా ఆగస్ట్ 13న విడుదల చేయాలని అనుకున్నారు. ఇంకా చాలా భాగం షూటింగ్ మిలిగి ఉండటం.. కోవిడ్ ప్రభావం వంటి కారణాలతో ఇది జరిగే పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన రెండు పార్టులుగా చేసేది నిజమైతే మాత్రం 'పుష్ప-1' ను విడుదలకు సిద్ధం చేయొచ్చు. ఇప్పటికే 'పుష్ప' పార్ట్ 1 ని దసరా బరిలో నిలులుతారని వార్తలు వస్తున్నాయి. మరి చివరకు అన్నీ అనుకున్నట్ట్లు జరిగి కరోనా మహమ్మారి కోపరేట్ చేస్తే అక్టోబర్ 13 స్లాట్ ని 'కేజీఎఫ్ 2' 'పుష్ప' లలో ఏ సినిమా బ్లాక్ చేసుకుంటుందో చూడాలి.
Tags:    
  • KGF2 
  • Pushpa 
  • Allu Arjun 
  • Yash 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS