ఆర్ సీబీ తో `కేజీఎఫ్‌-2` ప్ర‌చారం మామూలుగా లేదే!

Update: 2022-04-10 11:36 GMT
పాన్ ఇండియా చిత్రం `కేజీఎఫ్‌-2` భారీ అంచ‌నాల మ‌ధ్య ఈనెల ఏప్రిల్ 14న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. చాప్ట‌ర్ -1కి  కొన‌సాగింపుగా  తెర‌కెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్ష‌కాభిమానులు ఎంతో కాలంగా  వెయిట్ చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు అన్నింటికి తెర దించుతూ భారీ అంచ‌నాల‌తో మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారు. రిలీజ్ కి ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉండ‌టంతో అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతుంది. మ‌రోవైపు టీమ్ పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది.

తాజాగా ఈ వేడిలో మేక‌ర్స్  ప్ర‌చారం కోసం ఆర్ సీబీ (రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు) జ‌ట్టుతో అసోసియేట్ అయింది. చిత్ర  నిర్మాణ సంస్థ‌ హంబోలే ఫిల్మ్స్ -ఆర్ సీబీ జ‌ట్టుతో భాగ‌స్వామ్యం అయింది.  దీనిలో భాగంగా ఆర్ సీబీ జ‌ట్టు క్రీడాకారులు `కేజీఎఫ్ -2`లో  పాలు పంచుకున్న్టు తెలుస్తోంది. `కేజీఎఫ్` లోని పాత్ర‌లు.. బెంగుళూరు టీమ్ లోని విరాట్ కొహ్లీ- పాప్ డూప్లిసెస్ స‌హా ఇంకొంత మంది క్రీడాకారులు ఆ పాత్ర‌ధారుల ఎమోష‌న్ ని జ‌త చేసి ఓ వీడియో చేసారు.

వీడియో అంతా చాలా సీరియ‌స్ గా..`కేజీఎఫ్` సినిమా రేంజ్  ఇంటెన్ష‌న్ క‌ల్గి ఉంటుంది. వీడియో క్రీజీగా..ఇంట్రెస్టింగ్  గా సాగుతుంది. ఇలా ఓ ఐపీఎల్ టీమ్ తో చిత్ర నిర్మాణ సంస్థ అసోసియేట్ అవ్వ‌డం అన్న‌ది ఇదే తొలిసారి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియాలో ఏ ఐపీఎల్ సీజన్ లో ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోలేదు. `కేజీఎఫ్` క‌న్న‌డ చిత్రం కావ‌డంతోనే స్టానిక టీమ్ అయిన  బెగుంళూరు జ‌ట్టుతో హంబోలే ఫిల్మ్స్  టైప్ అయింది. ఈ జ‌ట్టుకి `కేజీఎఫ్` మ‌ద్ద‌తిచ్చింది. హంబోలే ఫిల్మ్స్ ఆ వీడియోని ట్విట‌ర్లో షేర్ చేసింది.

అస‌లే ఐపీఎల్ వేడి. అందులోనూ అంత‌కు మించి వేడెక్కించే యాక్ష‌న్ ఎంట‌ర్  టైన‌ర్ కేజీఎఫ్‌. దీంతో ఈ వీడియో నెట్టింట  వైర‌ల్ గా మారింది. `కేజీఎఫ్-2` రిలీజ్ కి ముందే జాతీయ‌..అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ల ద్వారా పాన్ ఇండియా దాటి పాన్ వ‌ర‌ల్డ్ లో ఫేమ‌స్ అవ్వ‌డం ఖాయం. సినిమా రిలీజ్ అయి హిట్టైతే  అదే టీమ్ తో  మ‌రో వీడియో రిలీజ్ చేసే అవ‌కాశం లేక‌పోలేదు.


Tags:    

Similar News