• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోర్టు అనుకూల తీర్పుతో...

కోర్టు అనుకూల తీర్పుతో `కాంతారా` ఆత్మ‌కు శాంతి

By - Tupaki Desk
Update: 2022-11-25 16:11 GMT
కేజీఎఫ్ ఫ్రాంఛైజీ త‌ర్వాత `కాంతార` పాన్ ఇండియా స‌క్సెస్  క‌న్న‌డ ప‌రిశ్ర‌మకు సూప‌ర్ కిక్కిచ్చింది. చిత్ర‌బృందంతో పాటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కూడా సంబ‌రాల్లో మునిగి తేలాయి. `కాంతార` అట‌వీ ప్రాంతంలోని ఒక గ్రామంలో సాగే యాక్షన్ థ్రిల్ల‌ర్ కాన్సెప్టుతో చ‌క్క‌ని విజువ‌ల్ ఫీస్ట్ గా తెర‌కెక్కింది. జాన‌ప‌ద నేప‌థ్యం ఎలివేష‌న్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు.  ఆయ‌నే ఇందులో క‌థానాయ‌కుడు. KGF నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ ప‌తాకంపై నిర్మించారు. థియేట‌ర్ల‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం ఇటీవ‌లే ఓటీటీలో కూడా విడుద‌లైంది.

కానీ ఊహించ‌ని విధంగా థియేట్రిక‌ల్ వీక్ష‌ణ‌తో పోలిస్తే ఓటీటీ వీక్ష‌ణ‌లో నిరాశ ఎదురైంది. డిజిట‌ల్లో అంత‌గా మెప్పించ‌లేక‌పోయింద‌ని కూడా నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగుతోంది.  ఇక ఈ సినిమా కోర్టు వివాదం  తెలిసిందే. కాంతార చిత్రానికి కీలకమైన పాటగా ``వ‌రాహ రూపం..`` ఉత్కంఠ పెంచుతుంది.

ఈ చిత్రానికి ఆత్మ లాంటి బాణి ఇది. కానీ ఇది న‌వ‌రసం అనే పాట‌కు కాపీ అంటూ కేరళకు చెందిన `తైక్కుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్` కాంతారా నిర్మాతలపై కాపీ క్యాట్ (ప్లాగ‌రిజం) కేసును నమోదు చేసింది. దీంతో ఆ పాట‌ను ఎడిట్ చేయాల్సి వ‌చ్చింది. కానీ కేరళ కోర్టు ఈరోజు పాటపై నిషేధాన్ని ఎత్తివేసింది. అప్ప‌టికే ఈ పాట లేకుండానే అమెజాన్ ప్రైమ్ లో సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

నిజానికి ఈ పాట‌పై వివాదం త‌లెత్త‌గా తొలుత స‌ద‌రు మ్యూజిక్ బ్యాండ్ కు అనుకూలంగా కోర్టు నిర్ణయం తీసుకుంది. దానివ‌ల్ల పాట‌ను మ‌ధ్యంత‌ర నిలుపుద‌ల (విచార‌ణ తేలే వ‌ర‌కూ కొన్నాళ్ల పాటు ఆపేయ‌డం) చేసారు. కానీ ఇంత‌లోనే ఈ కేసు కీల‌క మ‌లుపు తిరిగి అదే న్యాయస్థానం లోపాన్ని స‌వ‌రించింది.

ఈ పాట‌లో కాపీ క్యాట్ అంశాలేవీ లేవ‌ని ధృవీక‌రించింది. దీంతో కాంతార టీమ్ కి ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఇప్ప‌టికే ఈ మూవీ థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ఆడింది. త్వరలో డిజిటల్ వెర్షన్ లో వరాహ రూపం పాటను రీప్లేస్ చేస్తారా లేదా? అన్న‌ది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • kerala 
  • court 
  • liftsban 
  • varaharoopamsong 
  • kantara 
  • movie 
  • latestnews 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS