పవర్ స్టార్ తో కీర్తి సురేష్

Update: 2016-02-10 04:10 GMT
కోలీవుడ్ పవర్ స్టార్ విజయ్ ఇప్పుడు తెరి మూవీ షూటింగ్ చాలా బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ నాటికి ఈ మూవీని రిలీజ్ ప్లాన్ చేసిన విజయ్.. తన తర్వాతి ప్రాజెక్ట్ ని కూడా రెడీ చేసేస్తున్నాడు. ప్లానింగ్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే ఈ పవర్ స్టార్.. గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తుంటాడు. ఏప్రిల్ లో తెరి రిలీజ్ కానుండగా.. మే నుంచి కొత్త సినిమాని స్టార్ట్ చేసేస్తుండడం విశేషం.

భరతన్ దర్శకత్వంలో రూపొందే ఈ మూవీలో.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారనే వార్తలొచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. మలయాళ కుట్టి కీర్తి సురేష్ తో జత కట్టేందుకు విజయ్ సిద్ధమవుతున్నాడు. అలాగని.. ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఛాన్స్ ఉందనుకుంటే పొరపాటే. ఈ మూవీలో స్టోరీ ప్రకారం కేవలం ఒక హీరోయిన్ కి మాత్రమే ఛాన్స్ ఉందని.. ఆ పాత్రకు కీర్తి సురేష్ ఖాయమైందని యూనిట్ చెబుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం కీర్తి సైన్ చేసేసిందట కూడా.

సిటీ, విలేజ్.. రెండు బ్యాక్ డ్రాప్ లలోనూ నడిచే ఈ మూవీలో కీర్తి పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉండనుందట. తెలుగులో నేను.. శైలజ.. తర్వాత కీర్తికి డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు కోలీవుడ్ లోనూ విజయ్ తో జత కట్టడంతో.. ఈ మలయాళీ పాపకు తమిళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News