త్వరలోనే ఓల్డ్ బబ్లీ లుక్ లోకి మారతానంటున్న మహానటి..!

Update: 2020-11-06 10:50 GMT
'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్.. 'మహానటి' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సావిత్రి బయోపిక్ లో ఆమె నటనకు గాను జాతీయ పురస్కారం కూడా వచ్చింది. అయితే అప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే  కీర్తి సురేష్ ఈ మధ్య సన్నగా పీలగా కనిపిస్తోంది. ఇటీవల కీర్తి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న ఫొటోలకి నెటిజన్ బక్క చిక్కిపోయావంటూ కామెంట్స్ పెడుతున్నారు. కీర్తి లుక్ మారిన తర్వాత ఆమె నటించిన సినిమాలు ఓటీటీలలో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. కీర్తి లుక్స్ పై కామెంట్స్ వచ్చేలా చేసాయి. 'పెంగ్విన్‍' మరియు 'మిస్‍ ఇండియా' చిత్రాల రిజల్ట్ ఎలా ఉన్న కీర్తి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ లుక్స్ పై మాత్రం ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు.

కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో సేత పైకి తీసుకెళ్లడానికి సన్నాహకాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కీర్తి లుక్స్ చూసిన ఫ్యాన్స్ మహేష్ పక్కన సెట్ అవుతుందా లేదా అని ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ముఖంలో కళ తప్పిపోయిన మహానటి.. సినిమా స్టార్ట్ అయ్యేలోపు కాస్త బరువు పెరిగి పాత లుక్‍‌ లోకి వస్తే బాగుంటుందని మహేష్ అభిమానులు సోషమ్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే కీర్తి సురేష్ కూడా మళ్ళీ ఓల్డ్ లుక్ లోకి రావాలని ఆలోచిస్తున్నట్లు అర్థం అవుతోంది.

ఇటీవల కీర్తి నిర్వహించిన ట్విట్టర్ చిట్ చాట్ లో ఓ నెటిజన్ 'మేము మళ్ళీ పాత బబ్లీ కీర్తి ని ఎప్పుడు చూస్తాం?' అని ప్రశ్నగా.. 'కమింగ్ సూన్' అని రిప్లై ఇచ్చింది. అలానే 'సర్కారు వారి పాట' సినిమాలో తాను చెయ్యబోయే రోల్ విషయంలో చాలా ఎగ్జైట్ గా ఉన్నానని.. తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకుంటానని పేర్కొంది. ఇదిలా ఉండగా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్‍ లక్‍ సఖి’ రిలీజ్ కి రెడీగా ఉంది. నితిన్ సరసన నటిస్తున్న ‘రంగ్‍ దే’ మూవీ సెట్స్ పై ఉంది.
Tags:    

Similar News