అదే దారిలో కీర్తి సురేష్ కూడా...

Update: 2017-04-02 08:10 GMT
గతంలో మాదిరిగా ఈ తరం హీరోయిన్స్ ధైర్యం చేయలేకపోతున్నారనే మాట చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఓ కొత్త హీరోయిన్.. అప్ కమింగ్ స్టార్ భామల్లాంటి వారు.. పెద్ద స్టార్స్ తో.. సీనియర్ హీరోలతో చేయడం అంటే క్రెడిబిలిటీగా భావించేవారు. కానీ ఈ తరం కుర్రభామలు మాత్రం సీనియర్ హీరోలతో నటిస్తే.. తమకు కుర్రాళ్లు ఛాన్సులు ఇవ్వరని ఫిక్స్ అయిపోతున్నారు.

నయనతార మినహాయిస్తే.. అటు కుర్ర హీరోలను.. ఇటు సీనియర్లను హ్యాండిల్ చేయగల హీరోయిన్ మరొకరు కనిపించడం లేదు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఇదే దారిలోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఓ సీనియర్ స్టార్ పక్కన చేయాలంటూ ఈమెకు ఆఫర్ రాగా.. ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా తిరస్కరించేసిందట. కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న టైంలో.. సీనియర్ హీరోతో అంటే చేయలేనని ఓపెన్ గానే చెప్పేసిందట కీర్తి సురేష్.

రెమ్యూనరేషన్ భారీగా వచ్చే అవకాశమున్నా ఏ మాత్రం ఖాతరు చేయలేదట ఈ మల్లు భామ. ఇక ఈ చిన్నదాని కొత్త సినిమాల విషయానికి వస్తే.. సావిత్రి జీవితంపై తీస్తున్న బయోపిక్ లో టైటిల్ రోల్ ను.. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల మూవీలో లీడ్ హీరోయిన్ పాత్రను చేసేస్తూ.. క్రేజీ హీరోయిన్ అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News