ఫోటో స్టోరి: ఆపిల్ కే మ‌స్కా వేయ‌కు బోల్డ్ బ్యూటీ

Update: 2020-08-16 09:10 GMT
కావ్య త‌ప‌ర్ .. డ‌్యూరెక్స్ కండోమ్ యాడ్ తో పాపుల‌రైన బ్యూటీ. గుబులు పుట్టించే అందాల‌తో యూత్ ని క‌వ్వించే టాప్ మోడ‌ల్ గా ఆ ప్ర‌క‌ట‌న ఎలివేట్ చేసింది. ఆ త‌ర్వాత అదే ఈ బ్యూటీకి అవ‌కాశాలు తెచ్చి పెట్టింది. కండోమ్ ప్ర‌క‌ట‌న అనంతరం కావ్య త‌ప‌ర్ కి `అంత‌రిక్షం` సినిమాలో అవ‌కాశం ద‌క్కింది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ ‌తేజ్ తో క‌లిసి న‌టించింది. అటుపై ఫైట్ మాష్ట‌ర్ విజ‌య‌న్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ స‌ర‌స‌న `ఈ మాయ పేరేమిటో` చిత్రంలో న‌టించింది.

ప్ర‌స్తుతం త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది. ఆ మూవీ టైటిల్ ఇంకా నిర్ణ‌యించాల్సి ఉంది. ప‌నిలోప‌నిగా కావ్య త‌ప‌ర్ సోష‌ల్ మీడియాల్లో చెలరేగుతూ ఎందులోనూ త‌క్కువ కాద‌ని నిరూపిస్తోంది. రెగ్యుల‌ర్ గా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో దుమ్ము రేపుతోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్! అన్న‌ట్టు ఆ ఫోజులు క‌వ్వించేస్తున్నాయ్ మ‌రి.

తాజాగా కావ్య‌ బోల్డ్ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. వేడెక్కించే అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్ప‌ని ఈ భామ లోదుస్తుల్లో చెల‌రేగింది. బ్లాక్ అండ్ వైట్ ఛాయాచిత్రం లో `ఆపిల్`  కే మ‌స్కా వేస్తున్న ఆపిల్ బ్యూటీలా క‌వ్విస్తోంది. ఇలా చేస్తేనే అవ‌కాశాలొస్తాయా? అంటే చెప్ప‌లేం. త‌న‌కు ఆల్రెడీ ఒక ముద్ర ప‌డిపోయింది. బోల్డ్ బ్యూటీగానే త‌న‌ను ఆడియెన్ చూస్తున్నారు. ఇలా ఆర‌బోత‌పైనే ఆధార‌ప‌డ‌క న‌టన ప‌రంగా కావ్య‌ మెరుగులద్దితే మేక‌ర్స్ ఎంకరేజ్ చేస్తారేమో!
Tags:    

Similar News