కార్డుబోర్డులో కట్టప్ప పొడిచే సీన్

Update: 2017-04-23 05:32 GMT
బాహుబలి ది బిగినింగ్ మూవీ చివరలో వచ్చే సన్నివేశం.. అమరేంద్ర బాహుబలిని కట్టప్ప పొడిచేయడం. అసలు అప్పటివరకూ చూసిన సినిమాకు.. ఆ ఒక్క సన్నివేశం పూర్తిగా విభిన్నం. బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడనే ప్రశ్నకు.. ఈ నెల 28వరకూ సమాధానం దొరకడం దాదాపు అసాధ్యం.

అయితే.. ఈ ఒక్క సన్నివేశం ఎన్నో పజిల్స్ ను రేకెత్తించడమే కాదు.. మరెంతో మంది కళాకారులకు కూడా స్ఫూర్తిగా నిలిచింది. ఇదుగో ఇక్కడ కనిపిస్తున్న చిన్న ఆర్ట్ చూడండి. జస్ట్ థర్మాకోల్ ముక్కలను ఐదారు పార్ట్ లుగా కట్ చేసి.. ముందు లైటింగ్ వేసి.. బాహుబలిని కట్టప్ప పొడిచే సీన్ ని రెప్లికేట్ చేసేశారు. దీన్నే కార్డ్ బోర్డ్ ఆర్ట్ అని కూడా అంటారు. జనాల్లో బాహుబలి మూవీపై.. ఈ సన్నివేశంపై ఎంతటి ఆసక్తి ఉందో.. మరెంత మందికి స్ఫూర్తి నింపుతోందో అనేందుకు ఈ చిన్నపాటి ఉదాహరణ సరిపోతుంది.

ప్రతీ రంగానికి చెందిన కళాకారులు తమ చేతులతో బాహుబలికి ఏదో ఒక రకంగా  ప్రచారం చేస్తున్నారు.. తాము ప్రచారం పొందుతున్నారు. అయినా.. ఒక్క బాహుబలి ఇన్ని రకాలుగా.. ఇంత మందిని ఇన్ స్పైర్ చేయడం.. ఉపయోగపడ్డం రియల్టీ గ్రేట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News