కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న కత్రినా కైఫ్..!

Update: 2020-04-19 00:30 GMT
కత్రినా కైఫ్.. ఈ ముద్దుగుమ్మకి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ పేరుకు తగ్గట్టే తన అందాలతో కైపెక్కిస్తూ ఉంటుంది. నలభైకి దగ్గర పడుతున్న వయస్సులో కూడా తన హాట్ నెస్ తో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంది. 'బూమ్' సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ పొడుగు కాళ్ళ సుందరి. ఆ తర్వాత హీరో వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి' సినిమా ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. వెంటనే బాలకృష్ణతో 'అల్లరి పిడుగు'లో నటించి తర్వాత బాలీవుడ్‌కు తన మకాం మార్చింది. అక్కడ మాత్రం తన అంద చందాలతో ఇప్పటికీ అదరగొడుతూనే ఉంది. అంతేకాదు బాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ ఎంత మంది వచ్చిన వారందరికి పోటీనిస్తూ దూసుకుపోయింది.

స‌ల్మాన్ ఖాన్ - ర‌ణ్ బీర్ క‌పూర్ లాంటి స్టార్ హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపి అప్పట్లో సంచలనమే రేపింది ఈ హాట్ బ్యూటీ. ఆంగ్లో ఇండియన్ అయిన ఈ ముద్దుగుమ్మ‌కు బాలీవుడ్ బాగానే అవ‌కాశాలిచ్చి నెత్తిన పెట్టుకుంది. కానీ ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా ఏదో ఒకరోజు మాజీ అవ్వాల్సిందేగా. ప్రస్తుతం కత్రినా అదే స్టేజిలో ఉంది. ఈ మధ్య కత్రినా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తా కొడుతున్నాయి. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, భారత్, జీరో లాంటి వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో అవకాశాలకు దూరంగా ఉండిపోయింది ఈ బ్యూటీ. దాంతో చేసేదేమీ లేక అందాలను ఆరబోతకు తెరలేపింది.

రెచ్చిపోయి హాట్ ఫొటోలతో రచ్చ చేస్తున్న కత్రినాను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు మిగతా హీరోయిన్లు. మాజీ స్టార్ హీరోయిన్ అయినా అందాల ఆరబోతలో తాజానే అని నిరూపించింది. లాక్ డౌన్ లో ఇళ్లలోనే ఉంటున్న రసిక హృదయాలు ఇప్పుడు కైపెక్కించే కత్రినా హాట్ ఫోటో ఒకటి బయటకి తీశారు. ఈ ఫోటో ఫోజ్ చూస్తే అమ్మడిలోని హాట్ నెస్ ఏంటో తెలిసిపోతుంది. వలువలు వలిచి తన మత్తెక్కించే కళ్లతో రమ్మంటున్నట్టుగా నిలబడింది. కనీసం ఇవి చూసైనా మళ్లీ అమ్మడికి ఆఫర్లు వస్తాయేమో చూడాలి. కత్రినా కైఫ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న 'సూర్యవంశీ' సినిమాలో నటిస్తోంది.
Tags:    

Similar News