ఈ సెన్సార్ సస్పెన్స్ ఏంటి నాయకా?

Update: 2018-12-31 07:09 GMT
నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం కథానాయకుడు జనవరి 9 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆ రోజు వేరే సినిమాలేవీ లేవు కాబట్టి థియేటర్ల కౌంట్ భారీగా ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల వరకు మొదటి రెండు రోజులు పూర్తిగా కథానాయకుడి కంట్రోల్ లోనే ఉంటాయి. ఆ తర్వాత వినయ విధేయ రామ-ఎఫ్2లు పంపకాల కోసం వచ్చేస్తారు. మధ్యలో రజని పెట్ట కూడా ఉన్నప్పటికీ ప్రభావం అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ కథానాయకుడు విడుదల మరో 8 రోజుల్లో ఉండగా ఇప్పటిదాకా సెన్సార్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఏమి లేవు. అసలు అయ్యిందా లేదా అనే అనుమానాలు లేకపోలేదు.

యూనిట్ నుంచి ఇతర వర్గాల నుంచి వస్తున్న సమాచారం మాత్రం వేర్వేరుగా ఉంది. సెన్సార్ అయిపోయిందని క్లీన్ యు ఇచ్చేశారని కొందరు అంటుండగా ఆఫీసర్ ఒకరు సెలవులో ఉండటంతో ఓ రోజు పాటు వాయిదా పడిందని మరొకరు అంటున్నారు. సెన్సార్ కు కావాల్సిన పిఎక్స్ డి లోడింగ్ కూడా ప్రసాద్ ల్యాబ్స్ లో అయిపోయిందనే టాక్ కూడా ఉంది.మరోపక్క రెండు భాగాలూ చూపిస్తేనే సెన్సార్ చేస్తామని ఓ అధికారి చెప్పినట్టు మరో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఓ కథను సీక్వెల్ గా తీసినప్పుడు ఖచ్చితంగా రెండూ చూపాలన్న రూల్ లేదు. పైగా మహానాయకుడు వర్క్ ఇంకా బాలన్స్ ఉంది.

రెండూ ఒకేసారి చేయడం అసాధ్యం. సో ఎట్టి పరిస్థితుల్లో కథానాయకుడికి క్లియరెన్స్ రావాల్సిందే. అయితే ముహూర్తాల విషయంలో చాలా పట్టింపుగా ఉండే బాలకృష్ణ సెన్సార్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ఉంటారని అందుకే రిపోర్ట్ బయటికి రావడంలో ఇంత అయోమయం నెలకొందని మరో వెర్షన్ వినిపిస్తోంది. మొత్తానికి కథానాయకుడు అన్ని రకాలుగా టాక్ అఫ్ ది టౌన్ గా నిలుస్తోంది.


Full View

Tags:    

Similar News