బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ‘సప్త సాగరాలు’ బ్యూటీ.. రుక్మిణి వసంత్ గ్లామర్ హాట్ టాపిక్!
రుక్మిణి వసంత్ తన లాంగ్ హెయిర్‌ను ఫ్రీగా వదిలేసి, కెమెరా వైపు చూస్తూ ఇచ్చిన కిల్లింగ్ స్మైల్ కుర్రాళ్ల మనసులను దోచుకుంటోంది.
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కన్నడ ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్ తన సహజసిద్ధమైన నటనతో, హోమ్లీ లుక్స్‌తో మెప్పించిన ఈ బ్యూటీ, తాజాగా చేసిన ఒక స్టైలిష్ ఫొటోషూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. బ్లాక్ కలర్ డీప్ వినెక్ రిబ్బెడ్ కార్డిగాన్ టాప్‌లో మెడలో సింపుల్ గోల్డ్ చైన్ ధరించి ఆమె ఇచ్చిన క్లాసీ అండ్ గ్లామరస్ పోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
ట్రెండీ లుక్‌లో మురిపిస్తున్న ముద్దుగుమ్మ:
రుక్మిణి వసంత్ తన లాంగ్ హెయిర్‌ను ఫ్రీగా వదిలేసి, కెమెరా వైపు చూస్తూ ఇచ్చిన కిల్లింగ్ స్మైల్ కుర్రాళ్ల మనసులను దోచుకుంటోంది. ఇక ఈ ఫొటోషూట్‌లో రుక్మిణి స్టైలింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆమె వేసుకున్న బ్లాక్ బటన్-డౌన్ టాప్ క్రింది బటన్స్ ఓపెన్ చేసి ట్రెండీ అండ్ రిలాక్స్‌డ్ సిల్హౌట్ లుక్‌లో ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ సుజన ఈ బ్యూటిఫుల్ పిక్స్‌ను తన కెమెరాలో బంధించారు.
కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్‌కు:
2019లో కన్నడ చిత్రం 'బీర్బల్ త్రయం'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రుక్మిణి వసంత్‌కు, 'సప్త సాగరాలు దాటి' సినిమా ఒక బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ సినిమాలో ఆమె పండించిన ఎమోషన్స్ కు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వచ్చాయి. ఆ తర్వాత ‘బాణదరియల్లి’, ‘బఘీరా’ వంటి చిత్రాలతో తన వైవిధ్యాన్ని నిరూపించుకున్న ఈ నటి.. రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ లో నటిస్తూ పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయింది.
యష్, ఎన్టీఆర్ సినిమాలతో క్రేజీ లైన్ అప్:
ప్రస్తుతం రుక్మిణి వసంత్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉందనే చెప్పాలి. రాకింగ్ స్టార్ యష్ సరసన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘టాక్సిక్’ లో మెలిస్సా పాత్రలో నటిస్తోంది. దీనితో పాటు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్ ‘డ్రాగన్’ సినిమాలో కూడా రుక్మిణి లీడ్ హీరోయిన్‌గా ఎంపికై ప్రస్తుతం షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉంది.
సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన రుక్మిణి వసంత్, అటు స్టార్ హీరోల ప్రాజెక్టులతో దూసుకుపోతూనే.. ఇటు తన సోషల్ మీడియా ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇక క్లాస్ ప్లస్ మాస్ కాంబినేషన్‌లో ఉన్న ఈ కన్నడ బ్యూటీ రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మరింత రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రైజింగ్ స్టార్ క్రేజీ ప్రాజెక్టులకు మనమూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..