టైటానిక్‌ చూడాలంటే అసహ్యం అంటున్న హీరోయిన్‌

Update: 2021-01-08 11:12 GMT
హాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల సినిమాల్లో కూడా మోస్ట్‌ రొమాంటిక్ మూవీ ఏది అంటే టైటానిక్ అని ఎక్కువ శాతం మంది చెప్తారు. టైటానిక్ లో నటించిన హీరో హీరోయిన్ రెనాల్డో డెకాప్రియో.. కేట్‌ విన్‌ స్లేట్‌ లు ఎంతగా పాపులారిటీని దక్కించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి వారిని చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు గుర్తు పడుతారు. వీరిద్దరిని రొమాంటిక్ కపుల్‌ అంటూ సినీ అభిమానులు ఆరాధిస్తూ ఉంటారు. పాతికేళ్లు అయినా కూడా ఆ సినిమాకు ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. అందులో నటించిన వారికి కూడా ఇంకా స్టార్‌ డం ఉంది.

టైటానిక్ తో అంతటి గుర్తింపు దక్కించుకున్న కేట్‌ విన్‌ స్లేట్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పుడు టైటానిక్ చూడాలంటే నాకు అసహ్యంగా అనిపిస్తుంది. ఆ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ ను ఇప్పుడు చూడటం కష్టంగా అనిపిస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆ సినిమాను చూస్తూ ఉన్నప్పుడు నాకు సిగ్గుగా అనిపిస్తుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. టైటానిక్‌ సినిమా ఒక అద్బుత దృశ్య కావ్యం. ఎంతో మంది వర్థమాన దర్శకులకు ఆదర్శం. అలాంటి సినిమాను ఆ సినిమాలో నటించిన హీరోయిన్ చూడటం అసహ్యం అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని టైటానిక్‌ అభిమానులు అంటున్నారు.
Tags:    

Similar News