కాటమరాయుడికి అదే ఎడ్వాంటేజ్!!

Update: 2017-03-24 00:36 GMT
ఇప్పటివరకు ''కాటమరాయుడు'' వంటి సినిమాలు చాలానే వచ్చాయి. అలాగే అజిత్ నటించిన ''వీరుడొక్కడే'' కూడా తెలుగులో రిలీజైంది. స్టోరీ కూడా దాదాపు అందరికీ తెలిసిపోయింది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్‌ చేసిన ఈ రీమేక్ ఎలా ఇంప్రెస్ చేయగలుగుతుంది? సరిగ్గా సినిమా రిలీజ్ కు ముందు ఇటువంటి సందేహాలు ఉంటే మాత్రం.. వాటికి ఒక లాజికల్ ఆన్సర్ చెప్పుకోవచ్చు.

పవర్ స్టార్ ఇప్పటివరకు ఫ్యాక్షన్ సినిమాలను పెద్దగా చేయలేదు. ఒకవేళ బాలు.. బంగారం.. అన్నవరం వంటి సినిమాల్లో ఫ్యాక్షన్ తో కూడిన యాక్షన్ టచ్ ఇచ్చినా.. ఆ సినిమాల్లో వెనకుండే రౌడీలు ఫ్యాక్షన్ బ్యాచ్ ఏమో కాని.. పవన్ మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తూ వచ్చాడు. ముఖ్యంగా బంగారం సినిమాలో అయితే ఫ్యాక్షన్ వాతావరణంలో ఫారిన్ టూరిస్టు తరహా గెటప్ లో ఉంటాడు. కాని కాటమరాయుడులో మాత్రం తొలిసారిగా తానే ఒక ఫ్యాక్షనిస్టుగా కనిపిస్తున్నాడు పవన్. అందుకే ఈ లుక్ అండ్ ఫీల్ కొత్తగా ఉన్నాయి. జనాలు కాస్త కనక్ట్ అయినా కూడా ఇక కలక్షన్ల వర్షమే.

అలాగే కాటమరాయుడు సినిమాలో కామెడీ డోస్ బాగా ఎక్కువగానే ఉంటుంది. పవన్ కూడా ఒక లార్జర్ ద్యాన్ లైఫ్‌ హీరోగా కనిపిస్తాడు. ఇక పాటలు యావరేజ్ గా ఉన్నా కూడా.. పాటల్లో పవన్ మూవ్స్ అండ్ శృతి హాట్నెస్ పెద్ద ప్లస్సయ్యే ఛాన్సుంది. కాసేపు ఆగండి.. మన రివ్యూ వచ్చేస్తుందిగా!!
Tags:    

Similar News