• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘విశ్వరూపం-2’కు ఉన్న...

‘విశ్వరూపం-2’కు ఉన్న కష్టాలు చాలవని..

By - Tupaki Desk
Update: 2018-08-08 08:36 GMT
ఒక సినిమా పూర్తయ్యాక విడుదల విషయంలో జాప్యం జరిగిందంటే దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది. అది కూడా కొన్ని నెలలైతే పర్వాలేదు కానీ.. ఏళ్లకు ఏళ్లు సినిమా వాయిదా పడిందంటే ఇక అంతే సంగతులు. ఇలాంటి సినిమాలు ఆడిన దాఖలాలు చాలా తక్కువ. ఇదొక నెగెటివ్ సెంటిమెంటుగా మారిపోయింది. ఈ సెంటిమెంటు ‘విశ్వరూపం-2’ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. ‘విశ్వరూపం’ స్టయిల్లోనే కనిపిస్తున్న ఈ చిత్రంపై కమల్ ధీమాగా ఉన్నప్పటికీ.. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ప్రేక్షకుల్లో దీనిపై ఏమాత్రం ఆసక్తి నిలిచి ఉంటుందా అన్న సందేహాలు మాత్రం కొనసాగుతున్నాయి. దీనికి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవడం.. బజ్ కూడా కొంచెం తక్కువగానే ఉండటం కలవరపెడుతోంది. మరోవైపు ఫైనాన్స్ సమస్య సైతం దాన్ని వెంటాడుతోంది. ఒక సంస్థ ఈ సినిమా విడుదల ఆపాలంటూ కోర్టుకు కూడా వెళ్లడం తెలిసిందే.

ఈ తలనొప్పులు చాలవని ఇప్పుడు ఓ పరిణామం ‘విశ్వరూపం-2’కు ప్రతికూలంగా మారింది. మంగళవారం రాత్రి కరుణానిధి చనిపోవడంతో ఇప్పుడు తమిళనాడు అంతటా విషాదం నెలకొంది. అందరి చర్చలూ కరుణ మీదికి వెళ్లిపోయాయి. సినిమాల గురించి అసలెవరూ ఆలోచించే పరిస్థితి లేదు. కమల్ హాసన్ ప్రమోషన్లు ఆపేయాల్సి వచ్చింది. శుక్రవారం సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ముందు రెండు రోజులూ పత్రికలు.. టీవీలు..  వెబ్ సైట్లు. సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా కరుణే చర్చనీయాంశం అవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ‘విశ్వరూపం-2’ గురించి ఎవరు పట్టించుకుంటారన్నది సందేహం. సినిమా రిలీజ్ రోజు కూడా దీని చర్చ పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. కరుణ మరణం తాలూకు విషాదం కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది కాబట్టి... మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో సినిమా చర్చలు పెట్టడానికి చాలామంది సందేహిస్తారు. ఈ పరిస్థితుల్లో ‘విశ్వరూపం-2’ ఎలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
Tags:    
  • Karunanidhi 
  • Kamal Haasan 
  • Vishwaroopam 2 

Similar News

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

Copyright @2026

Powered by Blink CMS