`కార్తికేయ 2` ప‌క్కా VFX బేస్డ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

Update: 2020-09-07 05:45 GMT
పురాత‌న దేవాల‌యాల మార్మిక‌త.. హిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన కార్తికేయ చ‌క్క‌ని విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడు చందు మొండేటికి హీరో నిఖిల్ కి పాథ్ బ్రేకింగ్ మూవీ గా నిలిచింది. రొటీన్ కంటెంట్ కి భిన్న‌మైన శైలిలో తెర‌కెక్కించిన చందుకి మంచి పేరొచ్చింది. ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి చాలా కాలంగా చ‌ర్చ సాగుతోంది. ఈపాటికే రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ మొద‌లు కావాల్సింది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదా ప‌డింది.

నితిన్ పెళ్లి స‌హా మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ స‌న్నివేశం ఆల‌స్యానికి కార‌ణ‌మ‌య్యాయి. ఇక ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు చందు మొండేటికి ప‌క్కా క్లారిటీ వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. అక్టోబ‌ర్ 26 నుంచి చిత్రీక‌ర‌ణ ప్రారంభించి వేగంగా పూర్తి చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. కాన్సెప్ట్ వీడియోతో ప్ర‌చారం లో హీట్ పెంచా‌రు. మ‌రోసారి కాన్సెప్ట్ బేస్డ్ లోనే చందు మొండేటి ఈ మూవీని ప‌క్కాగా ప్లాన్ చేస్తున్నారు.

ఇక తొలి భాగం థ్రిల్ల‌ర్ మోడ్ లో తెర‌కెక్క‌గా.. సెకండ్ పార్ట్ మాత్రం పూర్తిగా థ్రిల్లింగ్ అంశాల‌తో పాటు వీఎఫ్‌.ఎక్స్ కి యాక్ష‌న్ కి ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తెలిసింది. ఇక బ‌డ్జెట్ ప‌రంగా స్కేల్ పెంచాల్సి ఉంటుంద‌ట‌. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఆ మేర‌కు బ‌డ్జెట్ ప‌రంగా రాజీకి రాకుండా తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. హిస్టారిక‌ల్ కాన్సెప్టుల‌కు యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉంటుంది కాబ‌ట్టి ఈ సినిమాని భారీ కాన్వాసుపైనే తెర‌కెక్కించి ప‌లు భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిసింది. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ గూఢ‌చారి సీక్వెల్ ప‌నుల్లోనూ బిజీగా ఉంద‌ని తెలిసింది.
Tags:    

Similar News