కార్తీ మళ్లీ మనసు పడ్డాడట!

Update: 2016-09-24 17:30 GMT
కోలీవుడ్ లో బోలెడంత క్రేజ్ ఉన్న కార్తి.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. యుగానికొక్కడు నుంచి తెలుగులో కూడా బోలెడంత ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోగా.. ఆవారాతో బోలెడంత క్రేజ్ సంపాదించేశాడు. అక్కినేని నాగార్జునతో కలిసి తెలుగు సినిమా ఊపిరిలో కూడా నటించాడు ఈ తమిళ హీరో.

రీసెంట్ గా హైద్రాబాద్ వచ్చిన కార్తి.. బోలెడన్ని కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. 'బ్లాక్ బస్టర్ మూవీ ఊపిరిలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాగార్జున గారితో నటించడం గొప్ప అనుభవం. చాలా కాలం గుర్తుండే జ్ఞాపకాలు నాకు ఈ సినిమాతో ఏర్పడ్డాయి' అని చెప్పిన కార్తి తన తర్వాతి ప్రాజెక్టుపై కూడా కొత్త సంగతులు వెల్లడించాడు. 'తెలుగులో మరో స్ట్రైట్ సినిమా చేయాలని అనుకుంటున్నా.. తప్పకుండా చేస్తా.. ఇది నా ప్రామిస్'  అంటూ వాగ్దానం కూడా చేసేయడంతో.. ఇప్పటికే కార్తీ తెలుగు మూవీపై డిస్కషన్స్ జరుగుతున్నాయనే టాక్ మొదలైపోయింది.

ప్రస్తుతం కార్తి మణిరత్నంతో కలిసి ఓ లవ్ స్టోరీ చేయనుండగా.. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా కెరీర్ ప్రారంభించుకున్న గురువుతో సినిమా చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు కార్తి. రీసెంట్ గా కాష్మోరా అనే మూవీని ఫినిష్ చేయగా.. దీపావళికి ఈ మూవీ విడుదల కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News