అక్కాచెల్లెళ్లు బాగానే ఉన్నారే

Update: 2017-09-09 08:31 GMT
బాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఏ స్థాయిలో ఆదరణ ఉంటుందో అదే స్థాయిలో హీరోయిన్స్ కి కూడా ఉంటుంది. అంతే కాకుండా ఒకే కుటుంబానికి చెందిన హీరోయిన్స్ బాలీవుడ్ లో చాలా మండే ఉన్నారు. ఇక వారు స్క్రీన్ షేర్ చేసుకుంటే అభిమానులు తెగ సంబరపడిపోతారు.ఇప్పుడు అదే తరహాలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు స్క్రీన్ షేర్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంటోంది.

వారు ఎవరో కాదు ముందు అక్క కరిష్మా కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగితే.. ఆ తర్వాత చెల్లి కరీనా కూడా అంతకు మించి ప్రతిభను కనబరిచి ఎక్కువ ఆదరనను రాబట్టుకుంది. అయితే వీరిద్దరూ వెండి తెరపై ఎప్పుడు సినిమాల్లో కలిసి నటించలేదు కానీ మొదటి సారి ఓ యాడ్ లో కలిసి నటించి అందరిని థ్రిల్ చేశారు.  మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి కోసం చేసిన యాడ్ లో కరీనా నే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఆ యాడ్ లో అక్క కరిష్మా పుట్టిన రోజుకు నెక్లెస్ కొందామని షాపింగ్ కి వెళుతుంది. అక్కడ నెక్లెస్ కొన్నాక నచ్చడంతో కరీనా మనసు మార్చుకొని ఒక పువ్వు మాత్రమే ఇస్తుంది. అయితే ఆ విషయం అక్క కరిష్మా పసిగట్టేసి మెడలో నెక్లెస్ బావుందని చెప్పడం అందరిని ఆకట్టుకుంటోంది.

కాన్సెప్ట్ లో ఇద్దరికి కాస్త ఇబ్బందిగా ఉన్నా రిలేషన్ మాత్రం బావుండడంతో అందరు బావుందని కామెంట్ చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News