బెబోకు మ‌ళ్లీ మ‌గ‌బిడ్డే.. ఇదిగో ఫ‌స్ట్ లుక్

Update: 2021-02-21 08:00 GMT
బెబో క‌రీనాక‌పూర్ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చార‌ని కొద్ది సేప‌టి క్రిత‌మే వార్త వెలువ‌డింది. ఇంత‌కీ బేబి గాళా.. బేబి బోయా? అంటూ ఆరాలు తీసారు అభిమానులు. ఇదిగో అలాంటి సందేహం ఉన్న‌వారి కోసమే ఈ జ‌వాబు.

కరీనా కపూర్ ఖాన్- సైఫ్ అలీ ఖాన్ జంట‌..మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. తొలి చూరు మ‌లిచూరు ఇద్ద‌రూ మ‌గ సంతాన‌మే కావ‌డం ఆస‌క్తిక‌రం.

నిన్న రాత్రి కరీనాను బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించగా ఆదివారం ఉద‌యం శిశువును ప్రసవించింది. 2016లో థైమూర్ జ‌న్మిస్తే.. ఐదేళ్ల‌కు ఇప్పుడు రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చార‌న్న‌మాట‌. ఇప్ప‌టికే థైమూర్ అలీఖాన్ పెరిగి పెద్ద‌వాడైపోతున్నాడు. అత‌డి బ‌ర్త్ డేలాకు అద్భుతమైన గిఫ్టులు అందుతున్నాయి.
Tags:    

Similar News