మరోసారి అమ్మానాన్న కాబోతున్న స్టార్‌ కపుల్‌

Update: 2020-10-26 05:47 GMT
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సైప్‌ అలీ ఖాన్‌ మరియు కరీనా కపూర్‌ ఖాన్‌ లు ఇప్పటికే ఒక బాబుకు తల్లిదండ్రులు అనే విషయం తెల్సిందే. వీరిద్దరు మళ్లీ తల్లిదండ్రులు అవ్వబోతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కరీనాతో పెళ్లి జరగక ముందే సైప్‌ అలీ ఖాన్‌ కు ఇద్దరు పిల్లలు. ఆయన కూతురు సారా అలీ ఖాన్‌ హీరోయిన్‌ గా ఇప్పటికే బాలీవుడ్‌ లో దూసుకు పోతుంది. మొదటి భార్య నుండి విడిపోయిన తర్వాత కరీనాను చేసుకున్న సైఫ్‌ తైమూర్‌ కు జన్మనిచ్చాడు. ఇప్పుడు కరీనా మరోసారి గర్బవతి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ విషయమై సైఫ్‌ అలీ ఖాన్‌ ను ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రశ్నించిన సమయంలో.. పిల్లలను పెంచడానికి ఇదే సరైన వయసు అని తాను భావిస్తున్నాను. కెరీర్‌ సరిగా సెటిల్‌ అవ్వని సమయంలో పిల్లలు పుడితే వారిపై ఎక్కువ శ్రద్ద చూపించలేక, వారితో సమయం గడపలేక బాధపడాల్సి వస్తుంది. కెరీర్‌ లో పూర్తిగా సెటిల్‌ అయిన తర్వాత పిల్లలు పుడితే వారికి పూర్తి న్యాయం చేయవచ్చు అనేది తన ఉద్దేశ్యం అంటూ సైఫ్‌ అలీ ఖాన్ నాల్గవ బిడ్డ గురించి అనధికారికంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయం ఎక్కవ రోజులు దాచడం సాధ్యం కాదు. కనుక ఈ నెల లేదా వచ్చే నెల అయినా బయట పడాల్సిందే.
Tags:    

Similar News