కాస్టింగ్‌ కౌచ్‌ అంటే చెప్పుతో కొడతా : కరాటే కళ్యాణి

Update: 2020-09-28 07:10 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ఒక కంటెస్టెంట్‌ గా వెళ్లిన ఆమెను బలమైన కంటెస్టెంట్‌ అనుకున్నారు. కాని ఆమెను ప్రేక్షకులు రెండవ వారంలోనే ఎలిమినేట్‌ చేశారు. ఆమె తీరును ప్రేక్షకులు అర్థం చేసుకోలేదా లేదంటే ఆమె బిగ్‌ బాస్‌ హౌస్‌ కు సూట్‌ కాదు అనుకున్నారో కాని ఆమెను హౌస్‌ నుండి ఎలిమినేట్‌ చేయడం జరిగింది. ఎలిమినేషన్‌ అయిన తర్వాత అందరి మాదిరిగానే ఆమె కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. కరాటే కళ్యాణి ఆ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెళ్లడించింది. ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్‌ లో ఉండే కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఆమెను ప్రశ్నించగా సీరియస్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌ లో అస్సలు కాస్టింగ్‌ కౌచ్ ఉండదని పేర్కొంది.

గతంలో కొందరు బిగ్‌ బాస్‌ పై కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేయడం జరిగింది. ఆ విషయమై కరాటే కళ్యాణి స్పందిస్తూ బిగ్‌ బాస్‌ కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేసిన వారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా బిగ్‌ బాస్‌ ఛాన్స్ పొందలేరు. వారు ఆఫర్‌ కోసం వెయిట్‌ చేయలేక అలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో నాకు తెలియదు. ఇంటర్వ్యూ చేసే వారు ఒక లేడీ. బిగ్‌ బాస్‌ ఎంపిక విషయంలో ఎలాంటి దాపరికాలు మద్య వర్తి ఉండరు. అలాంటప్పుడు కాస్టింగ్‌ కౌచ్‌ ఎలా ఉంటుందంటూ కళ్యాణి ప్రశ్నించారు. బిగ్‌ బాస్‌ పై బురద జల్లే ప్రయత్నంతో అలా చేస్తున్నారంది.

బిగ్‌ బాస్ హౌస్‌ గురించి ఇప్పుడు ఎవరు అయినా అలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్లని చెప్పుతో కొడతానంటూ హెచ్చరించింది. వీళ్లు ఇప్పటి వరకు బిగ్‌ బాస్‌ లో తమకు ఎదురైన కాస్టింగ్‌ కౌచ్‌ ను నిరూపించలేక పోయారు. అలాంటప్పుడు వారి మాటలు ఎలా నమ్ముతాం అంటూ కరాటే కళ్యాణి పేర్కొన్నారు. షో నుండి తన ఎలిమినేషన్‌ విషయమై మాట్లాడుతూ ఓటింగ్‌ విషయంలో అనుమానాలు ఉన్నాయంది.
Tags:    

Similar News