కరణ్.. నెవర్ బిఫోర్ మూవీ

Update: 2017-11-11 14:24 GMT
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ సినిమాలంటే ఒక తరహాలో సాగిపోతాయి. అతను ప్రధానంగా ఫ్యామిలీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు తీస్తాడు. వాటిలో ఎమోషన్లకు ప్రాధాన్యం ఇస్తాడు. ‘కుచ్ కుచ్ హోతా హై’ నుంచి ‘యే దిల్ హై ముష్కిల్’ వరకు కరణ్ ప్రతి సినమా అంతే. ఐతే ఇప్పుడు తన శైలికి భిన్నంగా అడల్ట్ టచ్ ఉన్న కామెడీ మూవీ చేయబోతున్నాడట కరణ్. ఇప్పటిదాకా తాను ఇలాంటి సినిమానే తీయలేదంటూ కరణ్ చేసిన ప్రకటన బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన దర్శకత్వంలోనే వచ్చిన ‘బాంబే టాకీస్’కు కొనసాగింపుగా ఈ సినిమా ఉంటుందని ప్రకటించాడు కరణ్ జోహార్. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.

లవ్-లస్ట్ మధ్య ఉన్న తేడాను సున్నిత అంశాలతో చెబుతూ మధ్య తరగతి భార్యాభార్తల కథతో ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందట. కొంచెం క్రియేటివ్ గా ఉంటూనే అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించేలా ఈ సినిమా తీస్తానంటున్నాడు కరణ్. ఈ సినిమా  కోసం చిన్న స్థాయి నటీనటులనే ఎంచుకోబోతున్నాడు కరణ్. హీరోగా విక్కీ కౌశల్ తో ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా పూర్తయిందట. కరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమా కోసం మిగతా నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. కరణ్ నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఇత్తెకాఫ్’ మంచి థ్రిల్లర్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
Tags:    

Similar News