కేజీఎఫ్ స్టార్ యశ్.. డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా..?

Update: 2020-05-03 00:30 GMT
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కన్నడ స్టార్ హీరో యశ్ ఒక్కసారిగా కోలార్ గోల్డ్ ఫీల్డ్ సినిమాతో.. అదే 'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ చాఫ్టర్1 మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి పెద్ద సంచలనమే సృష్టించింది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 200కోట్ల పైచిలుకు వసూల్ చేసిన మొదటి కన్నడ సినిమాగా కేజీఎఫ్ రికార్డు బద్దలు కొట్టింది. అయితే కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా దేశవాప్తంగా వీరాభిమానులు హీరో యశ్ కేజీఎఫ్2 సినిమాకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు.

ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్2 సినిమా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మళ్లీ దేశవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా హిందీ హక్కులను స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ దక్కించుకోనున్నట్లు తెలుస్తుంది. కేజీఎఫ్ 2 సినిమా సృష్టించిన సంచలనాన్ని, హీరో యశ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని కరణ్ ముందుకొచ్చినట్లు టాక్. ఇక ఇతర బాషలలో రూపొందిన బెస్ట్ సినిమాల హిందీ హక్కులను సొంతం చేసుకోవడానికి కరణ్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. సందర్భం వచ్చింది కదా.. అని కేజీఎఫ్ హీరో యశ్ ని డైరెక్ట్ ఫిల్మ్ తో బాలీవుడ్ కి పరిచయం చేసే ఉద్దేశంలో ఉన్నాడట కరణ్. చూడాలి మరి యశ్ త్వరలోనే బాలీవుడ్ లోకి నేరుగా అడుగు పెడతాడేమో..!
Tags:    

Similar News