క‌న్ను కొట్టి.. థీమ్ సింపుల్ అండ్ ట‌చింగ్

Update: 2019-07-20 14:46 GMT
శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా సినిమా `ర‌ణ‌రంగం`. మాస్ కుర్రాడిగా.. ఏజ్డ్ డాన్ గా ఈ చిత్రంలో శ‌ర్వా కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తున్నాడు. స్వామి రారా లాంటి క్లాసిక్ హిట్ ని తెర‌కెక్కించిన సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్లు ఆస‌క్తిని పెంచాయి. ఇటీవ‌లే రిలీజైన తొలి లిరికల్ సాంగ్ సీతా క‌ళ్యాణం ఆక‌ట్టుకుంది. `కన్నుకొట్టి.. చూసెనంట సుంద‌రీ.. మ‌న‌సు మీటి వెళ్లెనంట మ‌నోహ‌రి` అంటూ సాగే రెండో పాట ను తాజాగా విడుదల చేశారు.

ఈ లిరిక‌ల్ సాంగ్ వినేందుకు ఎంత సింపుల్ గా ఉందో యువ‌త‌రాన్ని అంతే క‌వ్విస్తోంద‌న‌డంలో సందేహం లేదు. కార్తీక్ రోడ్రిజ్ స్వ‌యంగా పాడ‌ట‌మే కాకుండా సంగీతం అందించారు. ట్యాలెంటెడ్ కృష్ణ చైత‌న్య లిరిక్ ని రాశారు. ఇక ఈ పాట థీమ్ పెప్పీగా ఆక‌ట్టుకుంటోంది. ఒక సింపుల్ కాలేజ్ గాళ్ లుక్ లో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని ఆక‌ట్టుకుంటే.. త‌న‌ని ఫాలో చేసే యువ‌కుడిగా శ‌ర్వానంద్ వేష‌ధార‌ణ నేచుర‌ల్ గా క‌నిపిస్తోంది. కాలేజ్ కి వెళ్లే అమ్మాయి వెంట ప‌డే కొంటె కుర్రాడిగా శ‌ర్వా టీజింగ్ ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ పాట ఆద్యంతం హాఫ్ శారీలో కాలేజ్ కి వెళ్లే అమ్మాయిగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్.. క‌వ్వింత థియేట‌ర్ల‌లో క‌నువిందే అన‌డంలో సందేహ‌మేం లేదు.

ఒక క్లాసిక్ ల‌వ్ స్టోరీని చూసి చాలా కాల‌మే అవుతోంది. శ‌ర్వా- క‌ళ్యాణి జంట న‌డుమ అలాంటి ప్రేమ‌క‌థ‌నే సుధీర్ వ‌ర్మ చూపిస్తున్నారా? అన్న‌ది చూడాలి. ఈ రెండో పాట‌లో క‌న్ను గీట‌డ‌మే కాదు.. సూద‌ల్లే చూస్తూ క‌ళ్యాణి అద్భుత‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ తో మైమ‌రిపిస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ ని లాంచ్ చేసేందుకు టీమ్ రెడీ అవుతోంద‌ట‌.

Full View

Tags:    

Similar News