• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాలీవుడ్ కు ఈగ విలన్

హాలీవుడ్ కు ఈగ విలన్

By - Tupaki Desk
Update: 2017-11-08 04:16 GMT
‘ఈగ’ సినిమా చూసిన వారెవరూ కన్నడ స్టార్ హీరో సుదీప్ ను అంత తేలిగ్గా మరిచిపోరు. ఆ సినిమాకు గ్రాఫిక్స్ ఎంత కీలకమో నటనపరంగా సుదీప్ అంతకన్నా ఎంతో కీలకం. లేని ఈగను ఊహించుకుంటూ విలన్ గా అతడు చూపించిన నటన అమోఘమనే చెప్పాలి. ఈగకన్నా ముందు రక్తచరిత్రలోనూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. తాజాగా కిచ్చా సుదీప్ హాలీవుడ్ లో రంగప్రవేశం చేయనున్నాడు.

ఆస్ట్రేలియన్ దర్శకుడు ఎడ్డీ ఆర్య డైరెక్షన్ లో రైజెన్ పేరుతో తెరకెక్కుతున్న ఇంగ్లీష్ మూవీలో సుదీప్ ముఖ్య పాత్ర చేయబోతున్నాడు. సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చింది. దీనిని కిచ్చా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో సుదీప్ న్యూయార్క్ లో స్థిరపడిన ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అమెరికన్ హీరోయిన్ నికొలే స్కాల్మొ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.  

సుదీప్ కు కన్నడం లో బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈగ తరవాత అతడికి టాలీవుడ్ - బాలీవుడ్ లోనూ గుర్తింపు లభించింది. ఇప్పుడు హాలీవుడ్ లో నటిస్తుండటంతో అతడి అభిమానులు పండగ చేసుకునంటున్నారు. ప్రస్తుతం కన్నడలో మరో టాప్ హీరో శివరాజ్ కుమార్ తో కలిసి విలన్ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు చిరంజీవి 151వ సినిమా సైరా నర్సింహారెడ్డిలోనూ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.



Tags:    
  • Kannada super star 
  • Kiccha sudeep 
  • Hollywood movie Risen 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS