• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జ‌క్క‌న్న‌పై క‌న్న‌డ...

జ‌క్క‌న్న‌పై క‌న్న‌డ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారా?

By - Tupaki Desk
Update: 2022-03-12 16:30 GMT
రాధేశ్యామ్‌, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల త‌రువాత అత్యంత క్రేజ్ ని సొంతం చేసుకున్న మూవీ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`. రాఖీ భాయ్ య‌ష్ న‌టించిన ఈ చిత్రం కోసం మునుపెన్న‌డూ లేని స్థాయిలో ప్రేక్ష‌కులు, య‌ష్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. `బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్` కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురుచూశారో అదే స్థాయి ఆస‌క్తితో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` కోసం అంతా ఎదురుచూస్తున్నారు. బ‌జ్ కూడా భారీ స్థాయిలోనే వుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం కాయంగా క‌నిపిస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఫ‌స్ట్ పార్ట్ రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించ‌డంతో చాప్ట‌ర్ 2పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. చాలా కాలంగా వాయిదాప‌డుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించేశారు. అయితే  ప్ర‌మోష‌న్స్ ని మాత్రం ప్రారంభించ‌డం లేదు. ఈ విష‌యంలో ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్ అవుతున్నార‌ట‌. ఇదే విష‌యంపై మేక‌ర్స్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నిల‌దీశారు కూడా.  

రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ తీవ్రంగా బాధ‌ప‌డుతున్నార‌ట‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం రాజ‌మౌళి అని, అత‌ని `ఆర్ ఆర్ ఆర్‌` కార‌ణంగానే కేజీఎఫ్ మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించ‌డం లేద‌ని ఆరోపిస్తున్నార‌ట‌. అంతే కాకుండా `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ త‌రువాతే `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ప్ర‌మోష‌న్స్ ని మొద‌లుపెట్టాల‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ వున్నార‌ని, వారి ఆలోచ‌న‌కు కార‌ణం రాజ‌మౌళినే అని క‌న్న‌డ ఫ్యాన్స్ ఆయ‌న‌పై గుర్రుగా వున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంతే కాకుండా `ఆర్ ఆర్ ఆర్‌` స్థానంలో `కేజీఎఫ్` వుంటే రాజ‌మౌళి ఇలాంటి నిర్ణ‌యం తీసుకునే వాడా? అని మండిప‌డుతున్నార‌ట‌. ఇదిలా వుంటే రాజ‌మౌళి పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్‌` విడుద‌ల‌య్యాకే `ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. అదే పంథాను `కేజీఎఫ్` టీమ్ కూడా ఫాలో అవ్వాల‌నుకుంటోంద‌ట‌. కానీ ప్ర‌మోష‌న్స్ కి మ‌రీ ఇంత లాగ్ ఎందుక‌న్న‌ది మాత్రం ఫ్యాన్స్ కి అంతుచిక్క‌డం లేద‌ట‌.
Tags:    
  • Rajmouli 
  • khf2 
  • prashanthneel 
  • yash 
  • kannada 
  • rrr 
  • tollywood 
  • latestnews 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS