• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైజ్ జీరో.. తెలుగు సినిమా...

సైజ్ జీరో.. తెలుగు సినిమా కాదు

By - Tupaki Desk
Update: 2015-11-25 09:30 GMT
ఇంకో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలుగు సినిమా గురించి ఇవేం మాటలు అంటారా? ఈ సినిమా తెలుగులో తెరకెక్కిన మాట వాస్తవమే కానీ.. నిజానికిది బాలీవుడ్ లో తీయడం కోసం రాసుకున్న కథ అట. ప్రకాష్ కోవెలమూడి భార్య కాకముందే కనిక ధిల్లాన్ ఈ కథ రాసి బాలీవుడ్ లో ప్రయత్నాలు కూడా చేసిందట. ప్రకాష్ భార్యగా మారాక కూడా ఆమెకు ఈ కథను హిందీలో తెరకెక్కించాలన్నే కోరికట. నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ను కలిసి కథ చెప్పినపుడు కూడా బాలీవుడ్ లో ఎవరితో ఈ సినిమా తీద్దామన్న చర్చే వచ్చిందట. ఐతే వరప్రసాదే ఈ సినిమాను తెలుగు - తమిళ భాషల్లో అనుష్కతో తీద్దామని చెప్పి అనుష్కను సంప్రదించాడట.

‘‘సైజ్ జీరో యూనివర్శల్ కాన్సెప్ట్. దీన్ని దేశంలోని అన్ని ప్రేక్షకులకూ చూపించాలని కనిక ఆశపడింది. నన్ను ఈ కథతో కలిసినపుడు హిందీలో తీద్దామనే చెప్పింది. అసలు సౌత్ లో ఈ క్యారెక్టర్ ఎవరూ చేయరన్నది ఆమె అభిప్రాయం. ఐతే నేను అనుష్కతో చేద్దామంటే.. తను స్టార్ హీరోయిన్ కదా, ఇలా లావుగా కనిపించడానికి ఇష్టపడదేమో. బడ్జెట్ కూడా వర్కవుట్ కాదేమో అని కనిక అనుమానంగా మాట్లాడింది. కానీ అనుష్కతో పెద్ద స్థాయిలో సినిమా చేద్దామని నేనే ఒప్పించా. అప్పటికప్పుడు అనుష్కతో మాట్లాడించా. ఐతే నేను అనుష్కకు ఇది మంచి కథ అని, లావుగా కనిపించాలని ఏమీ చెప్పలేదు. ముందు కథ వినమన్నా. విన్నాక తనే సినిమా చేయడానికి, బరువు పెరగడానికి సంతోషంగా ఒప్పుకుంది. ఐతే ఇది లేడీ ఓరియెంటెడ్ ఫిలిం అయినప్పటికీ భారీ స్థాయిలోనే చేయాలని బాగా ఖర్చుపెట్టాం, భారీ తారాగణాన్ని ఎంచుకున్నాం’’ అని వరప్రసాద్ చెప్పారు.
Tags:    
  • Kanika 
  • Size Zero Movie 
  • Telugu NEws 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS