చెర్రీ వైఫ్ తో బాలీవుడ్ సింగర్ పార్టీ

Update: 2016-03-19 05:35 GMT
రామ్ చరణ్ భార్య ఉపాసనా కామినేని.. ముందు నుంచీ బిజినెస్ లలో బాగా యాక్టివ్. ఛారిటీ కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొనే ఉపాసనకు.. టాలీవుడ్ తో బాలీవుడ్ లోనూ బోలెడంత మంది స్నేహితులు ఉన్నారు. వీళ్లలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా ఒకరు.

హైద్రాబాద్ వచ్చినప్పుడల్లా ఉపాసనతో టైం స్పెండ్ చేయడం కనికకు అలవాటు. హిందీ సినిమాల్లోనే పాటలు పాడుతున్న కనిక.. గత కొంతకాలంగా తరచుగా హైద్రాబాద్ వస్తోంది. తాజాగా ఇలా వచ్చినపుడు.. తన స్నేహితురాలైన ఉపాసనతో కలిసి హైద్రాబాద్ లో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ లో పెట్టింది కనిక. 'ఉప్సీ..లవ్ యూ.. సో మెనీ మెమరీస్' అంటూ ట్వీట్ చేసింది కనికా కపూర్.

అంతే కాదు.. ఉపాసనతో కలిసి తీసుకున్న ఓ ఫోటను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఈ బాలీవుడ్ సింగర్. ఒకళ్లనొక్కళ్లు గట్టిగా పట్టుకుని తీసుకున్న సెల్ఫీ చూస్తుంటే.. వీళ్లిద్దరూ ఏ రేంజ్ లో ఫ్రెండ్స్ అనే విషయం ఈజీగా అర్ధమవుతుంది.
Tags:    

Similar News