• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చ‌ర‌ణ్ సినిమాని ఆపేసిన...

చ‌ర‌ణ్ సినిమాని ఆపేసిన క‌మ‌ల్?

By - Tupaki Desk
Update: 2022-08-15 07:30 GMT
జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తి ష్టాత్మ‌కంగా తెర‌క్కించిన 'RRR' ప్ర‌పంచ వ్యాప్తంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డ‌మే కాకుండా రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో మెగా ప‌వ‌ర్ స్టార్ మంచి ఊపులో వున్నారు. ఈ మూవీ అందించిన జోష్ తో వెంట‌నే ఎస్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో RC15 ని మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. భారీ హంగామా మ‌ధ్య ఈ మూవీని ప్రారంభించిన శంక‌ర్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేస్తూ స్పీడు పెంచారు.

స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ని హైద‌రాబాద్ లో లాంఛ‌నంగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో అట్ట‌హాసంగా ప్రారంభించారు. ఆ త‌రువాత విశాఖ‌ప‌ట్నం, రాజ‌మండ్రి, అమృత్ స‌ర్ వంటి త‌దిత‌ర ప్రాంతాల్లో కీల‌క షెడ్యూల్స్ నిచేశారు. 1930 కాలం నాటి పీరియాడిక్ నేప‌థ్యానికి ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్ కి లింక‌ప్ చేస్తూ ఈ మూవీని స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది.

రామ్ చ‌ర‌ణ్ డ్యుయెల్ రోల్ లో క‌నిపించ‌నున్న ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత శాతం షూటింగ్ జ‌రుపుకుంది అన్న విష‌యంలో క్లారిటీ లేదు. చిత్ర వ‌ర్గాలు కూడా ఆ వివ‌రాల్ని ఇంత వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. జ‌రిగినంత వ‌ర‌కు అయితే కీల‌క ఘ‌ట్టాల‌ని మాత్రం శంక‌ర్ పూర్తి చేశార‌ని తెలిసింది. ఇదిలా వుంటే క‌మ‌ల్ హాస‌న్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

కార‌ణం దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ తో బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ అందించిన స‌క్సెస్ తో క‌మ‌ల్ మంచి జోష్ తో వున్నారు. ఈ టైమ్ ని క‌రెక్ట్ గా యూజ్ చేసుకోవాల‌ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్లాన్ చేస్తోంది.

క‌మ‌ల్ తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ 'ఇండియ‌న్ 2'ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. భారీ క్రేజ్ యాక్సిడెంట్ త‌రువాత లైకాకు, శంక‌ర్ కు మ‌ధ్య ఏర్ప‌డిన అభిప్రాయ భేధాలు, ఆ త‌రువాత వారు కోర్టుని ఆశ్ర‌యించ‌డం తెలిసిందే.

ఈ వివాదాన్ని క‌మ‌ల్  ప‌రిష్క‌రించి 'ఇండియ‌న్ 2' తిరిగి ప‌ట్టాలెక్కేలా చేశార‌ట‌. ఈ నేప‌థ్యంలో 'విక్ర‌మ్‌' సూప‌ర్ స‌క్సెస్ త‌రువాత 'ఇండియన్ 2'ని ప‌ట్టాలెక్కిస్తున్నారు. ఈ కార‌ణంగానే రామ్ చ‌ర‌ణ్ మూవీకి బిగ్ బ్రేక్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. 'ఇండియ‌న్ 2' పూర్తి చేసుకున్నాకే శంక‌ర్ RC15 కోపం వ‌స్తార‌ట‌. ఈ లోగా చ‌ర‌ణ్ మ‌రో ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. గౌత‌మ్ తిన్న‌నూరి సినిమాని త్వ‌ర‌లో ప‌ట్టాలెక్కించే అవకాశం వుంద‌ని తెలిసింది. ఈ మూవీని యువీతో పాటు ఎన్వీ ప్ర‌సాద్ నిర్మించ‌నున్నారు.
Tags:    
  • KamalHassan 
  • RamCharan 
  • RC15 
  • Indian2 
  • Shankar 
  • Dilraju 
  • Vikram 
  • Hit 
  • RRR 
  • Rajamouli 
  • Hyderabad 
  • TupakiNews 
  • Movienews 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS