• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మాస్టర్‌' పీస్ ను...

'మాస్టర్‌' పీస్ ను రిపీట్‌ చేస్తున్న కమల్ డైరెక్టర్‌

By - Tupaki Desk
Update: 2021-04-21 10:30 GMT
యూనివర్శిల్ స్టార్‌ కమల్ హాసన్ తో ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'విక్రమ్‌'. విభిన్నమైన నేపథ్యంలో కమల్‌ హాసన్ ను చాలా విభిన్నంగా చూపిస్తున్న ఈ సినిమా లో మలయాళ స్టార్ నటుడు ఫహద్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ను పాన్‌ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్న దర్శకుడు లోకేష్‌ మరో స్టార్‌ నటుడిని ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విక్రమ్‌ సినిమా లో కమల్‌.. ఫహద్‌ లతో పాటు మరో నటుడు విజయ్‌ సేతుపతి కూడా నటించబోతున్నారు. ఈ ముగ్గురు కూడా ముగ్గురే. ఇలాంటి కాంబినేషన్‌ ఒకటి వస్తుందని ఊహించలేదు అంటూ తమిళ సినీ అభిమానులు ఉవ్విల్లూరుతున్నారు.

లోకేష్ గత చిత్రం మాస్టర్ లో విజయ్‌ ను మించి విలన్‌ గా నటించిన విజయ్‌ సేతుపతికి మంచి పేరు వచ్చింది. సినిమా సక్సెస్‌ కు విజయ్‌ సేతుపతి కారణం అంటూ వార్తలు వచ్చాయి అంటే ఏ రేంజ్ లో ఆయన నటించాడో అర్థం చేసుకోవచ్చు. అంతటి అద్బుత నటన కనబర్చి మాస్టర్‌ పీస్‌ అనిపించుకున్న విజయ్‌ సేతుపతికి విక్రమ్‌ సినిమాలో మరో బెస్ట్‌ పాత్రను లోకేష్‌ కనగరాజ్ ఆఫర్‌ చేయడం జరిగిందట. ఆయన ఆఫర్‌ ను కాదనుకుండా విజయ్‌ సేతుపతి ఓకే చెప్పాడని కూడా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పునః ప్రారంభం అయ్యింది.

కమల్‌ హాసన్‌ తమిళనాడు ఎన్నికలతో బిజీగా ఉండటం వల్ల రెండు నెలల పాటు వాయిదా వేశారు. ఇటీవల షూటింగ్‌ ను ప్రారంభించడంతో పాటు ఫహద్‌ మరియు విజయ్‌ సేతుపతిలు కూడా షూటింగ్‌ లో పాల్గొంటున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ను ప్రముఖ నిర్మాణ సంస్థ తో కలిసి కమల్ స్వయంగా నిర్మిస్తున్నాడు.
Tags:    
  • kamal hasan 
  • kamal hasan movies 
  • kamal hasan new movie 
  • kamal hasan master 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS