• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ ఆ సినిమాల్ని ఏం...

కమల్ ఆ సినిమాల్ని ఏం చేయబోతున్నాడు..

By - Tupaki Desk
Update: 2017-03-11 10:58 GMT
ఇండియా మొత్తంలో ఫాలోయింగ్ ఉన్న సౌత్ హీరోల్లో కమల్ హాసన్ ఒకడు. ఎప్పుడూ ప్రేక్షకులకు ఏదో కొత్తదనం పంచాలని తపించే కమల్ ను ఎంతోమంది ఇష్టపడతారు. ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. తన ప్రతి సినిమా మీదా జనాల్లో ఆసక్తి రేకెత్తించడంలో కమల్ నేర్పరి. కానీ సమస్య ఏంటంటే.. కమల్ ప్రతిష్టాత్మకంగా భావించే సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో.. ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. ఆయన 90ల చివర్లో మొదలుపెట్టిన ‘మరుదనాయగం’ అప్పట్లో ఎంతటి సంచలనమో తెలిసిందే. కానీ ఆ చిత్రం మధ్యలో ఆగిపోయింది. దీన్ని మళ్లీ మొదలుపెడతానని చాలాసార్లు చెప్పాడు కమల్. కానీ దాని సంగతేంటో తేలలేదు. మరోవైపు ‘విశ్వరూపం-2’ సంగతీ అతీ గతీ తెలియకుండా ఉంది. దీన్ని కూడా బయట పడేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ మధ్య కమల్ చెప్పాడు. కానీ ఆ తర్వాత అప్ డేట్ లేదు. ఇక కమల్ చివరగా మొదలుపెట్టిన ‘శభాష్ నాయుడు’ ఆయనకు యాక్సిడెంట్ జరగడంతో ఆగిపోయింది. పూర్తిగా కోలుకున్నప్పటికీ ఆ సినిమాను పున:ప్రారంభించలేదు కమల్.

ఇప్పుడు చూస్తే ఆయన రాజకీయ అరంగేట్రం దిశగా సాగుతున్నట్లు చెబుతున్నారు. జల్లికట్టు వివాదం మొదలైనప్పటి నుంచి కమల్ రాజకీయాల మీదే దృష్టిపెడుతున్నారు. జనాల్లో చైతన్యం తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న శూన్యతను కమల్ భర్తీ చేస్తాడని ఈ మధ్య గట్టిగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ పెండింగులో పెట్టిన సినిమాల పరిస్థితేంటో మరి. రాజకీయారంగేట్ర హడావుడిలో కమల్ ఆ సినిమాల్ని పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? అవి పూర్తయి ప్రేక్షకుల ముందుకొస్తాయా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Kamal Hassan 
  • Political Entry 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS