ఏడేళ్ళు శిక్ష తగ్గించిన కమల్

Update: 2015-05-25 07:30 GMT
కమల్ హాసన్ మీద ఆయన సినిమాల మీదే ఎంతోమంది కేసులు వేస్తుంటారు. అలాంటిది ఆయన శిక్ష విధించడం ఏంటి.. మళ్ళీ తగ్గించడం ఏంటి అనేగా మీ సందేహం..? అయితే మీరీ కథనం చదవాల్సిందే.

కమల్ హాసన్ ఎంతటి ప్రతిభావంతులో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నటుడిగా విభిన్న పాత్రలు, కథకుడిగా సరికొత్త కథలు ఇలా ఆయన చేసే ప్రతి పనిలోనూ ఉత్తమంగా ఉండేలా చేస్తుంటారు కమల్. ఈ ప్రతిభావంతుడు తన ప్రతిభతో ప్రజలను మెప్పించడమే కాదు. ఎదుటివారిలోని ప్రతుభను గుర్తిస్తారు కూడా. అలా తన వద్ద సహాయ దర్శకునిగా పనిచేసిన రాజేష్ ప్రతిభను గుర్తించి దర్శకత్వ అవకాశమిచ్చారు 'చీకటి రాజ్యం' సినిమాతో. రాజేష్ కమల్ వద్ద ఏడేళ్ళ పాటు పనిచేశారు. ఆ విషయంపై కమల్ స్పందిస్తూ 14 ఏళ్ల యావజ్జీవ కారాగార శిక్ష విధించిన వారికి సత్ప్రవర్తన కింద ఏడేళ్లకు శిక్ష తగ్గిస్తారు. అలాగే నేను కూడా రాజేష్ మంచితనం, ప్రతిభ గుర్తించి ఏడేళ్ళకే దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను అంటూ తనదైన శైలిలో చెప్పారు. అదీ అసలు విషయం. అన్నట్టు ప్రతిభావంతమైన సంగీత దర్శకుడు జిబ్రాన్ ని దేశమంతా గుర్తించడానికి కారణం కూడా కమలే. 
Tags:    

Similar News